»   » పవన్ పులి చిత్రంలో ...తప్పు అనుకోవటం లేదు శ్రేయ

పవన్ పులి చిత్రంలో ...తప్పు అనుకోవటం లేదు శ్రేయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో తాను చేస్తున్న ఐటం సాంగ్ ని కొంతమంది అవకాశాలు లేక చేస్తున్నట్లుగా భావించి మాట్లాడుతున్నారని అది తప్పని శ్రియ చెప్పుకొచ్చింది. సినిమాల్లో క్రేజీ హీరోయిన్స్ స్పెషల్‌ సాంగ్స్‌ చేయడంలో తప్పుందని నేననుకోను. ఒకే హీరోయిన్‌పై సినిమాలోని పాటలన్నీ చిత్రీకరిస్తే చూసే రోజులు పోయాయి. అందుకే దర్శకనిర్మాతలు తమ చిత్రాల్లో ఒకరికంటె ఎక్కువమంది హీరోయిన్లను తీసుకుంటున్నారు. అంతేకాదు.. నాలాంటి క్రేజీ హీరోయిన్లతోనూ స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేయిస్తున్నారు. అందులో తప్పుపట్టడానికేమీ లేదని నా అభిప్రాయం" అంది శ్రీయ. తెలుగులో తాను ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నానని హీరోయిన్‌గా తనకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే తనతో సాంగ్‌ చేయిస్తున్నా రంటోంది. హీరోయిన్‌గా తనకు అవకాశాలు సన్నగిల్లుతున్నందునే స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తున్నాననడం హాస్యాస్పదమని దుయ్యబడుతోంది. హీరోయిన్‌గా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే తాను స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన విషయాన్ని శ్రీయ గుర్తు చేస్తోంది. అదేం కాదు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి...ఆఫర్స్ వచ్చినప్పుడే డబ్బు సంపాదించుకోవాలి..అదే శ్రియ ఫాలో అవుతోందని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu