»   » చెన్నై వరద బీభత్సం: హీరో సిద్ధార్థ ఇంట్లో ఇలా (ఫోటోస్)

చెన్నై వరద బీభత్సం: హీరో సిద్ధార్థ ఇంట్లో ఇలా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళనాడులో భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చెన్నై నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తన ఇంట్లోకి నీరు చేరిన ఫోటోలను సిద్ధార్థ్ ట్విట్టర్లో పోస్టు చేసాడు. తన ఇంటి పరిస్థితి ఇలా ఉంటే తమిళనాడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోడంటూ ట్వీట్ చేసాడు. మేమంతా టెర్రస్ పైకి పోతున్నాం. తమిళనాడును ఆ దేవుడే కాపాడాలి అని సిద్ధార్థ ట్వీట్ చేసాడు.

తన క్రూ ఫ్యామిలీస్ షిప్ట్ అవటానికి అపార్టమెంట్స్ వెతుకుతున్నాం అంటున్నారు సిద్దార్ద. చాలా మంది తన ఆఫీస్ లోనూ, ఇంటి వద్ద చాలా మంది షెల్టర్ కోసం ఉన్నారని, ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి ఫ్లాట్ ఉంటే చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసారు సిద్దార్ద.

Siddharth tweet about Chennai floods

కొద్ది రోజుల క్రితం... సిద్దార్ద నేషనల్ మీడియాపై విరుచుకు పడ్డారు. తమ తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాల్లో వరదలు ప్రజలను ముంచెత్తుతుంటే.. జాతీయ మీడియా ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నను స్పందించారు.

చెన్నైలోని వరద బీభత్సాన్ని పట్టించుకోకుండా.. ఆమీర్‌ ఖాన్‌, షీనా బోరాలకు సంబంధించిన అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. సిద్ధార్థ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్యలు చేస్తూ.. మా గురించి కూడా మాట్లాడండి అంటూ జాతీయ మీడియాకి విజ్ఞప్తి చేశారు.

English summary
"House flooded. Moving to the terrace. God save Tamil Nadu. Bathrooms submerged. Water coming out of the drains. I am an affluent actor. This is my house. Imagine rest of TN." Siddharth tweeted.
Please Wait while comments are loading...