»   » శంకర్ దర్శకత్వంలో ఆ రొమాంటిక్ హీరో?

శంకర్ దర్శకత్వంలో ఆ రొమాంటిక్ హీరో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు, శివాజి వంటి మెగా హిట్ సినిమాల దర్శకుడు శంకర్ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ చిత్రంలో రొమాంటిక్ హీరో సిద్దార్ధ నటించనున్నాడని సమాచారం. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. సిద్దార్ధని వెండి తెరకు బోయ్స్ తో పరిచయం చేసిన శంకర్ మరోసారి యూత్ మనోభావాలకి దగ్గరగా ఉండే చిత్రం తీయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఆయన రజనీకాంత్ తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రోబో' చిత్రం 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. వేసవికి విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సిద్దార్ధ సోలో హీరోగా చేసిన 'స్టైకర్' చిత్రం మొన్న శుక్రవారం రిలీజైంది. అలాగే రాఘవేంద్రరావు కుమారుడు దర్శకత్వంలో సిద్దార్ధ 'యోధ' టైటిల్ తో ఓ సోషియే ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే గ్రామీణ నేపథ్యంలో సాగే 'బావ' చిత్రాల్లో నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu