»   » ఆమె వెళ్లిపోతుంటే...కంటతడి పెట్టిన హీరో శింబు!

ఆమె వెళ్లిపోతుంటే...కంటతడి పెట్టిన హీరో శింబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇదేదో సినిమా వార్త కానేకాదు. తమిళ హీరో శింబు నిజంగానే ఏడ్చాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకాలం తనకు ఆప్యాయత, అనురాగాలు, ప్రేమను పంచిన ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సంఘటన ఇటీవల శింబు నివాసంలో చోటు చేసుకుంది. శింబు సోదరి అలేఖ్య వివాహం ఇటీవల జరిగింది. అలేఖ్య పుట్టింటి నుండి అత్తారింటికి వెలుతుంటే శింబు కంటతడి పెట్టారు.

అలేఖ్య వివాహం సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ అభిషేక్‌తో ఇటీవల జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తారింటికి సాగనంపడం తెలిసిందే. తనకు ఎంతో ప్రియమైన సోదరి ఇంటి నుండి వెలుతుంటే శింబు....ఓ వైపు చెల్లికి పెళ్లయిందనే ఆనందం, మరో వైపు ఆమె తమకు దూరం అవుతుందనే బాధతో భావోద్వేగానికి గురయ్యాడు.

Simbu Cries As 'She' Leaves His Home

తన ఫీలింగ్స్‌ను శింబు ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు. 'పెళ్లయిన తర్వాత నా సోదరి ఆమె భర్తతో పాటు వెళ్లి పోయింది. ఈ సందర్భంగా ఏడుపును ఆపుకోలేక పోయాను. చెల్లి వెళ్లి పోతుంటే నా మనసు ఎంతో బాధ పడింది. బ్రేకప్ అయినపుడు కూడా ఇంత బాధ పడలేదు' అంటూ శింబు ట్విట్టర్లో పేర్కొన్నారు.

తమిళ హీరో శింబు సోదరి అలేఖ్య వివాహం అభిలాష్‌తో ఈ నెల 9న జరుగగా...10వ తేదీన చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు తమిలనాడు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి, స్టాలిన్, హీరోయిన్ సంగీత, హీరో విజయ్, ప్రముఖ దర్శకుడు శంకర్, మీనా, ప్రభు, కార్తి, ఖుష్భూ, సుందర్ సి, బాలచందర్ తదితరులు హాజరయ్యారు.

English summary

 Simbu seems to be missing her badly. After being with him till date and sharing a wonderful relationship, time has made her to leave the happy home. Well, if you are wondering about whom we are talking, then it is none other than his sister Ilakkiya, who married a software engineer Abhilash last week.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu