»   »  స్టార్ హీరో పుట్టిన రోజున మరో స్టార్ చిత్రం

స్టార్ హీరో పుట్టిన రోజున మరో స్టార్ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'యంగ్‌ సూపర్‌స్టార్‌' శింబు.. అజిత్‌కు పెద్ద అభిమాని అనే విషయం తెలిసిందే. 'తల' సినిమా విడుదలైతే తాను కూడా ఓ సాధారణ అభిమానిలా తొలిరోజే సినిమా చూసేస్తుంటాడు. అజిత్‌ అభిమానులు కూడా శింబును ఆదరిస్తుంటారు. అందువల్లే తన చిత్రాలకు అజిత్‌కు సంబంధించిన సన్నివేశాలను కూడా జోడిస్తుంటాడు శింబు. ఈ సారి ఓ మెట్టెక్కి.. తన అభిమాన నటుడు అజిత్‌ పుట్టినరోజున తాను నటించిన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Simbu Releases his film on Ajith's Birthday

ప్రస్తుతం శింబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వాలు' (తోక). హన్సిక హీరోయిన్. చిత్రీకరణ దాదాపు చివరిదశకు చేరుకుంది. వచ్చేనెలలో ఆడియోను ఆవిష్కరించనున్నారు. అయితే సినిమాను మాత్రం అజిత్‌ పుట్టినరోజైన మే ఒకటోతేదీన విడుదల చేయాలని అనుకుంటున్నాడు శింబు. దీనికి సంబంధించిన పనులు కూడా సాగుతున్నాయని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. గౌతం దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రంలో శింబు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అజిత్‌ నటించిన ప్రతి చిత్రాన్ని విడుదల రోజే చూడటం శింబు అలవాటు. 'ఆరంభం' విడుదల సందర్భంగా నగరంలోని కాశీ థియేటర్‌లో తొలి షోనే చూశాడు శింబు. అయితే ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న కారణాన 'వీరం' చూడలేకపోయాడట. అయితే రెండు రోజుల ముందుగానే ఆయన వీక్షించాడట. దీనిపై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. '' 'వీరం' చూశాను. 'తల' ఇందులో చాలా బాగున్నాడు. పొంగల్‌కు సరిపోయే చిత్రమిది. తల, దర్శకుడు శివ మాస్‌ ప్రేక్షకుల నాడిని బాగా అర్థం చేసుకుని చిత్రాన్ని అందించారు. మళ్లీ వీక్షించేందుకు సిద్ధమయ్యాను''అని తెలిపాడు.

English summary

 Simbu Plans to release his long awaited film ‘Vaalu’ on May Day (1st of May 2014), which is not only the World Laborers’ Day, but also the Birth Day of Thala Ajith. This has been a good will friendship gesture of Simbu to honor Ajith. Simbu has got great admiration for Ajith, moreover Simbu is an ardent fan of Ajith, and he will always make it a point to see the movies of Ajith on the first day, first show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu