»   » హన్సికకి లవర్ ఇచ్చిన బర్తడే గిప్ట్

హన్సికకి లవర్ ఇచ్చిన బర్తడే గిప్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : ''పుట్టిన రోజు కానుకగా శింబు ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు. అదేంటనేది ఇప్పుడే చెప్పను'' అంటోంది హన్సిక. ఆమె ప్రియుడు శింబు ప్రత్యేకమైన కేక్‌ని పంపాడట. దాంతోపాటు ఓ విలువైన బహుమతిని కూడా అందజేశాడట. ఆ విషయం రహస్యంగా ఉంచుతోంది. గత కొంతకాలంగా శింబు,హన్సిక మద్య లవ్ ఎఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె పుట్టిన రోజుకి ఇచ్చిన గిప్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకొంది. తను దత్తత తీసుకున్న చిన్నారులు, కుటుంబ సభ్యుల మధ్య కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకుది. ''వేలమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి దీవెనలతోనే నా పుట్టినరోజు వేడుక పరిపూర్ణమవుతుంది'' అని ఈ సందర్భంగా ట్వీట్‌ చేసింది హన్సిక.

'హన్సిక పుట్టిన రోజుకి ఏం బహుమతి ఇవ్వాలో తెలియక తల బద్దలు కొట్టుకొంటున్నాను. ఎవరైనా సలహా ఇవ్వండి' అంటూ గురువారం ట్వీట్‌ చేశాడు శింబు. దీంతో ఆయన ఏం ఇస్తున్నాడన్న విషయం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఆ విషయంపై హన్సిక మాట్లాడుతూ ''ఆ బహుమతి ఎంతో ఆకర్షణీయమైనది'' అని చెప్పుకొచ్చింది. ''నా యువరాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు'' అంటూ ట్విట్టర్‌లో సందేశం పంపాడు శింబు.

తమిళ హీరో శింబు, ముంబై ముద్దుగుమ్మ హన్సిక ప్రేమలో పడ్డారు. ఈ సంగతిని హన్సిక, శింబు ఇద్దరూ స్వయంగా ధృవీకరించారు. కొంతకాలంగా ఆ ఇద్దరి మధ్యా 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' నడుస్తోందంటూ కోలీవుడ్‌లో బాగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వాళ్లిద్దరూ జంటగా తమిళంలో 'వాలు', 'వేట్టైమన్నన్' సినిమాలు రూపొందుతున్నాయి. ఈ సినిమాల సెట్స్ మీదే వాళ్లు ఒకరికొకరు మానసికంగా సన్నిహితమయ్యారు. వెబ్ మీడియాలో కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్యా ప్రేమాయణం నడుస్తోందనీ, పెళ్లి కూడా చేసుకునే అవకాశాలున్నాయనీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు హన్సిక ఆ సంగతి నిజమేనంటూ కుండబద్దలు కొట్టేసింది.

"నా వ్యక్తిగత జీవితం గురించి చాలా పుకార్లు వింటున్నాను. వాటిలో నిజమేమిటో చెప్పాలనుకుంటున్నా. అవును. ఐ యామ్ సీయింగ్ ఎస్.టి.ఆర్. ఇంతకుమించి నా వ్యక్తిగత జీవితం గురించి ఏమీ మాట్లాడను'' అని హన్సిక ట్వీట్ చేసిన కొద్దిసేపటికే "అవును. నేను హన్సికతో ఉంటున్నాను. ప్రస్తుతం ఆమె కెరీర్ చాలా బాగా నడుస్తోంది. పెళ్లి విషయం మా కుటుంబం నిర్ణయిస్తుంది. మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశాడు శింబు. సో.. అతి త్వరలోనే శింబు, హన్సిక జంట కాబోతున్నట్లే.

English summary
The actress, Hansika who recently announced her relationship with actor Simbu, truly seems to be celebrating a grand birthday with her dear boyfriend. The actress, was gifted a princess cake by her boyfriend, who had recently tweeted asking his friends and fans on what to give the actress. While the cake was only a small guesture, nobody knows what Simbu has actually gifted the actress, but Hansika said, "and about iam_STR gift. . i will let you know all later .its just a very adorable present. :)." Simbu, who celebrated with Hansika at midnight, tweeted, "Many more happy returns of the day my princess ihansika ... love u and god bless u ma :)," earlier today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu