»   » త్రిషతో మూడోసారి చేస్తున్నాడు !

త్రిషతో మూడోసారి చేస్తున్నాడు !

Posted By:
Subscribe to Filmibeat Telugu
Simbu, Trisha Krishnan to team up again
చెన్నై : గత కొంతకాలంగా త్రిష కు సరైన సినిమాలు లేక విలవిల్లాడుతోంది. దాంతో ఆమె తనతో చేసిన హీరోలను కలిసి,తిరిగి తమ కాంబినేషన్ కు ప్రయత్నిస్తోంది. ఈ ప్రాసెస్ లో ఆమె శింబుని ఒప్పించగలిగింది. మరో ప్రక్క శింబు తన పాత హీరోయిన్లతో మళ్లీ జత కడుతున్నారు. ఇప్పటికే నయనతారతో సినిమా చేస్తున్న ఆయన తాజాగా త్రిషతో ఆడిపాడనున్నారు. నయనతారతో 'వల్లవన్‌' తదితర చిత్రాల్లో నటించిన శింబు ఏడేళ్ల తర్వాత 'ఇదు నమ్మఆళు'లో జోడీ కట్టారు. పాండిరాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నటి త్రిషతో ముచ్చటగా మూడో సారి జంట చేరనున్నారీ లిటిల్‌ సూపర్‌స్టార్‌.

శింబు - త్రిష జంటగా గతంలో 'అలై', 'విన్నైతాండి వరువాయా' వచ్చాయి. వీటిలో 'విన్నైతాండి వరువాయా' సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కి వీరి జంటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది విడుదలై నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్య - అనుష్క జంటగా 'ఇరండాం ఉళగం' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించి చేతులు కాల్చుకున్న సెల్వరాఘవన్‌ ప్రస్తుతం ఓ లోబడ్జెట్‌ చిత్రాన్ని రూపొందించటంపై దృష్టి సారించారు.

హీరోగా శింబును ఎంచుకున్న ఆయన... త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేశారు. గతంలో వీరి జంటకు చక్కని పేరు ఉండటంతో తన కొత్త చిత్రానికి అది కలిసొస్తుందనే ధీమాలో సెల్వరాఘవన్‌ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.


తెలుగులో విషయానికి వస్తే... ఎమ్‌.ఎస్‌.రాజు స్వీయ దర్శకత్వంలో'రంభ ఊర్వశి మేనక' ('రమ్‌' )అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నికీషా పటేల్‌, ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఫైనాన్సియల్ క్రైసిస్ లో ఇరుక్కుని ఆగిపోయింది. ఈ చిత్రం మేజర్ షెడ్యూల్స్ రెండు జరిగి మూడో షెడ్యూల్ వద్ద ఆగిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఆర్దిక ఇబ్బందులు రావటంతో ఎమ్.ఎస్ రాజు చేతులెత్తేసారని చెప్పుకుంటున్నారు.

English summary

 After the success of Tamil romantic-drama "Vinnaithaandi Varuvaaya", actors Simbu and Trisha Krishnan are teaming up again for yet-untitled Tamil project to be helmed by filmmaker Selvaraghavan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu