»   » ఇదిగో ఇంకో ఆఫర్..ఇంక పెళ్లేం చేసుకుంటుంది

ఇదిగో ఇంకో ఆఫర్..ఇంక పెళ్లేం చేసుకుంటుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : త్రిష..పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేది గత రెండు రోజులుగా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే అవకాసం కనపడటం లేదని చెన్నై వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఆమె వరస పెట్టి సినిమాలు ఒప్పుకోవటమే దానికి కారణం. ముఖ్యంగా తాజాగా ఓ పెద్ద సినిమా కమిటైంది. తమిళ స్టార్ శింబు సరసన ఆమె సినిమా ఒప్పుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళ,తెలుగు అనే తేడా లేకుండా ... సినీ పరిశ్రమలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని దాటుకుని దిగ్విజయంగా దూసుకెళ్తున్న నటి త్రిష. ప్రస్తుతం ఆమె శింబు హీరోగా నటించనున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపికైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'అలై', 'వినైతాండి వరువాయా' చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు.

Simbu, Trisha to reunite for Selvaraghavan's film

ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే సెల్వరాఘవన్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చనున్నారు. 'లింగ' చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్న తెలుగు నటుడు జగపతిబాబు ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. మే ద్వితీయ వారంలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది.

ఈ సినిమా గురించి త్రిష మాట్లాడుతూ ....జీనియస్‌ దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించడం అమితమైన ఆనందం. చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నా. శింబుతో కలిసి మూడో చిత్రంలో నటిస్తున్నానని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమాకు అరవింద్‌ కృష్ణ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.

English summary
Actors Silambarasan aka Simbu and Trisha Krishnan are teaming up again for yet-untitled Tamil project to be helmed by filmmaker Selvaraghavan.
Please Wait while comments are loading...