»   » శృతి హాసన్, అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్)

శృతి హాసన్, అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇక సింగం-3 తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు.

కాగా ఈ చిత్ర తమిళ, తెలుగు భాషల టీజర్‌ను సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.

తాజాగా సినిమాకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. సూర్య, అనుష్క, శృతి హాసన్ లుక్ అదిరింది.

సూర్య నట విశ్వరూపం

సూర్య నట విశ్వరూపం

ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుందని నిర్మాతలు తెలిపారు.

రెస్పాన్స్ అదుర్స్

రెస్పాన్స్ అదుర్స్

ఇటీవల విడుదలైన తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ చక్కటి స్పందన లభించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుందని నిర్మాత తెలిపారు.

నీతినిజాయితీలే ఊపిరి

నీతినిజాయితీలే ఊపిరి

నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈ నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేసి, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.

స్టేజిపై క్షమాపణ కోరిన హీరో సూర్య, ఇంకోసారి అలా జరగదని హామి

స్టేజిపై క్షమాపణ కోరిన హీరో సూర్య, ఇంకోసారి అలా జరగదని హామి

క్షమాపణ కోరిన హీరో సూర్య, ఇంకోసారి అలా జరగదని హామి చైన్నై: హీరో సూర్య సాధారణంగా చాలా హంబుల్ గా ఉంటారు. ఆయనతో ఎవరికి విభేధాలు ఉండవు. అలాంటిది ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్దితి రీసెంట్ గా ఓ స్టేజిపై వచ్చింది. అదీ ఓ సీనియర్ జర్నలిస్ట్ కు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

సినిమా హీరోలు స్టార్ హీరో హోదా వచ్చిన తర్వాత జన సమ్మర్ధ ప్రదేశాల్లోకి రావడానికి దాదాపుగా ఇష్ట పడరు. మరి అలాంటిది భార్యకు కోసం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రాధిక కూతరు పెళ్లంటే మాటలా? మెగాస్టార్ తో సహా మొత్తం హాజరు(ఫొటోలు)

రాధిక కూతరు పెళ్లంటే మాటలా? మెగాస్టార్ తో సహా మొత్తం హాజరు(ఫొటోలు)

ముఖ నటి రాధిక కుమార్తె రయాన్‌ - మిథున్‌ల వివాహం వేడుక ఆదివారం మహాబలిపురంలో అత్యంత వేడుకగా జరిగింది. అనంతరం జరిగిన సాదర విందు కార్యక్రమం.. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.

షాకింగ్ : బాంబులతో పేల్చేస్తామని సింగం డైరక్టర్ కు వార్నింగ్, పోలీస్ కేసు పెట్టాడు

షాకింగ్ : బాంబులతో పేల్చేస్తామని సింగం డైరక్టర్ కు వార్నింగ్, పోలీస్ కేసు పెట్టాడు

సూర్యతో సింగం వంటి హిట్ కొట్టిన దర్శకుడు హరి. ఈ దర్శకుడు కు తమిళ సినీ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఎస్ 3 చిత్రం(సింగం 3) చిత్రం షూటింగ్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘సింగం 3’: వైజాగ్‌లో బీచ్ రోడ్డులో హీరో సూర్య టీం హల్ చల్ (ఫోటోస్)

‘సింగం 3’: వైజాగ్‌లో బీచ్ రోడ్డులో హీరో సూర్య టీం హల్ చల్ (ఫోటోస్)

సూర్య నటించిన సింగం, సింగం 2 సినిమాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూడో చిత్రం ప్రస్త.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Singam 3 teaser release today evening 8pm. S3 also known as Singam 3 is an upcoming 2016 Indian Tamil action film written and directed by Hari. A sequel to the 2013 film Singam II and the third film in the Singam franchise, it stars Suriya, Anushka Shetty and Shruti Haasan in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu