సింగర్ ఎస్ఎస్ మానసి వివాహం, హాజరైన హీరోయిన్ తమన్నా

By Bojja Kumar

డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ ఎంఎం మానసి వివాహం ఇటీవల చెన్నైలో సింపుల్‌గా జరిగింది. డాక్టర్ అభినేష్‌ను ఆమె పెళ్లాడారు. ఈ వివాహానికి కొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు హీరోయిన్ తమన్నా కూడా అటెండ్ అయ్యారు. బాహుబలితో పాటు ఊపిరి, అభినేత్రి చిత్రాల్లో తమన్నాకు పాత్రకు మానసి డబ్బింగ్ చెప్పారు.

ఎంఎం మానసి-అభినేష్ వివాహ వేడుకకు హాజరై వారిని విష్ చేసిన తమన్నా.... నూతన జంట ఫోటోను తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేశారు. మానసి నా డార్లింగ్ అంటూ తమన్నా పేర్కొనడం గమనార్హం.

Singer MM Manasi has tied the knot with Dr Abhinesh

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్, మ్యూజిక్ బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంటుతో ఎదిగిన సింగర్లలో ఎస్ఎస్ మానసి ఒకరు. తెలుగు, తమిళంలో పాటు సౌతిండియా భాషల్లో పలు సినిమాలకు ఆమె పాటలు పాడారు. ఇటీవల విడుదలైన సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం'లో 'రంగమ్మా రంగమ్మా' పాటను పాండింది ఈవిడే.

తెలుగులో 1 నేనొక్కడినే, బలుపు, తడాఖా, లెజెండ్, పవర్, ఆహా కళ్యాణం, ఆగడు, గోవిందుడు అందరి వాడేలే, పులి, అఖిల్, సన్నాఫ్ సత్యమూర్తి, శివం, కుమారి 21 ఎఫ్, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, మహానుభావుడు, ఉన్నది ఒక్కటే జిందగీతో చిత్రాల్లో ఆమె పాటలు పాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X