twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోలో ఫస్ట్ టాక్.. దుల్కర్ సల్మాన్ టెర్రిఫిక్ యాక్టింగ్.. ఒకే టికెట్‌పై నాలుగు సినిమాలు

    By Rajababu
    |

    Recommended Video

    Dulquer Salmaan "Solo" Movie Review దల్కర్ సల్మాన్ టెర్రిఫిక్ యాక్టింగ్..

    దక్షిణాది యువ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం సోలో. శ్రుతీహరిహరన్, నేహా శర్మ, సాయి ధన్సిక హీరోయిన్లుగా నటించిన చిత్రం శుక్రవారం (అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైతాన్ చిత్రంతో దర్శకుడిగా మారిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకుడు. నీరు, నిప్పు, గాలి, భూమి అనే అంశాల ఆధారంగా అల్లుకొన్న కథ ఇది. ఈ సినిమాకు సంబంధించిన తొలి టాక్‌ పాజిటివ్‌గా వినిపించడం విశేషం.

    నాలుగు షేడ్స్‌లో..

    నాలుగు షేడ్స్‌లో..

    శివ భగవానుడు స్ఫూర్తిగా తీసుకొని శేఖర్, త్రిలోక్, శివ, రుద్ర అనే నాలుగు షేడ్స్‌లో నంబియార్ అలుకున్న కథ సోలో. నాలుగు కథలను చక్కటి స్క్రీన్‌ప్లేతో సోలోకు తుది రూపం అందించాడు దర్శకుడు.

     శేఖర్ కాలేజీలో ఓ దాదా

    శేఖర్ కాలేజీలో ఓ దాదా

    ఫస్ట్ ఎపిసోడ్‌లో శేఖర్ ( దుల్కర్ సల్మాన్) ఈ చిత్రంలో కాలేజీలో ఓ దాదా. రాధిక (సాయి ధన్సిక) అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు. ఆ తర్వార రాధిక అంధురాలు అని తెలుస్తుంది. వారి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారంతో తొలి ఎపిసోడ్ సాగుతుందట. ఈ కథ ప్రకృతిలోని నీటికి సంబంధించింది.

    త్రిలోక్ స్టోరి ఈ విధంగా..

    త్రిలోక్ స్టోరి ఈ విధంగా..

    ఈ కథలో త్రిలోక్ కథను దర్శకుడు నంబియార్ నడిపించారు. త్రిలోక్ కథను శివుడి ప్రతిరూపంగా మలిచాడు. ఈ ఏపిసోడ్ చాలా వేగంగా, వినోదాత్మకంగా సాగుతుంది. త్రిలోక్ కథ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఈ కథ ప్రకృతిలోని గాలికి స్ఫూర్తి.

    మూడో ఎపిసోడ్‌లో రుద్ర పాత్ర

    మూడో ఎపిసోడ్‌లో రుద్ర పాత్ర

    మూడో ఎపిసోడ్‌లో రుద్ర పాత్ర. ఈ చిత్రంలో చాలా బలహీనమైన ఎపిసోడ్ అని ప్రేక్షకులు, విమర్శకులు సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. రుద్ర సైనికుడి కథ. ఇటీవల వచ్చిన మణిరత్నం చిత్రంలోని కార్తీ పాత్రను పోలి ఉంటుంది. రుద్రకు ప్రియురాలిగా నేహా శర్మ నటించారు. ఈ పాత్ర భూమికి ప్రతిరూపం.

     చివరి ఎపిసోడ్ శివ

    చివరి ఎపిసోడ్ శివ

    ఈ కథలో చివరి ఎపిసోడ్ శివ. ఈ కథ ఓ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించింది. దల్కర్ పాత్ర అప్పుడే పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ డైనమేట్‌లా ఉంటుందట. ఈ కథలో దల్కర్‌కు మాటలే ఉండవట. మొత్తంగా ఒక్కటంటే ఒక్కటే డైలాగ్ చెప్పడం విశేషం. ఈ పాత్ర నిప్పులా ఉంటుంది. శివ ప్రియురాలిగా శ్రుతి హరిహరన్ నటించింది.

     నంబియార్ సక్సెస్

    నంబియార్ సక్సెస్

    నాలుగు కథలను ఒకే సినిమాగా అందించే ప్రయోగంలో దర్శకుడు నంబియార్ సక్సెస్ అయ్యాడనే మాట వినిపిస్తున్నది. అయితే నాలుగు కథల్లో కొన్నింటిని తెరపైన చెప్పడంలో కొంత తడబాటుకు గురైనట్టు తెలిసింది. ఓవరాల్‌గా ఈ చిత్రంలో దల్కర్ నటన హైలెట్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మణిరత్నం సినిమాను గుర్తు తెస్తాయని విమర్శకులు వెల్లడిస్తున్నారు.

    నటీనటులు వీరే..

    నటీనటులు వీరే..

    సోలో చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాయి ధన్పిక, నేహ శర్మ, శృతిహరిహరన్, నాజర్, సుహాసిని మణిరత్నం తదితరులు నటించారు. ఈ ఫస్ట్ టాక్‌ను ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అదించడం జరిగింది.

    English summary
    Solo is modelled on Lord Shiva's four different avatars -- Shekhar, Trilok, Shiva and Rudra. It begins with Shekhar's story, a college rogue, with a stutter, who falls for Radhika (Sai Dhansika). every story in Solo, the colour patterns that are used are symbolic, add the necessary thematic effect. Bejoy Nambiar's screenplay eschews mainstream storytelling. In the sense that each story has its own timeframe with very little inventiveness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X