»   » అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా కూడా ఓకే చేసింది

అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా కూడా ఓకే చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీ తదుపరి చిత్రానికి సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. సురేష్‌కృష్ణ చెప్పిన 'బాషా-2' కథ రజనీకి నచ్చడంతో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకుంటుందో... లేదోనన్న భావన పెరగడంతో కేఎస్‌ రవికుమార్‌ చెప్పిన కథకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు రజనీ. ఈ సినిమాకు 'చారులత' ఫేం పొన్‌.కుమరన్‌ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు.

ఇందులో రజనీకాంత్‌ సరసన అనుష్క నటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి సోనాక్షిసిన్హా కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సోనాక్షితో చర్చించారని, ఆమె కూడా నటించేందకు అంగీకరించారని తెలుస్తోంది. మొత్తానికి సూపర్‌స్టార్‌ కొత్త చిత్రానికి ఈనెల 20వ తేదీన కొబ్బరికాయ కొట్టనున్నట్లు అనధికార సమాచారం. ఈ మేరకు మైసూర్ లో పెద్ద సెట్ డిజైన్ చేస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ మసాలా చిత్రంగా రూపొందనుంది.

Sonakshi Sinha in Rajanikanth film

రజనీకాంత్ హీరోగా నటించిన 'విక్రమసింహ' ఏప్రియల్ 11న విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ రిలీజ్ తేది ని ప్రకటించారు. పెర్‌ఫార్మన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్‌ లుల్ల నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచిన పాటల్ని రీసెంట్ గా విడుదలయ్యాయి.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

English summary
Anushka Shetty has been paired opposite Rajanikanth in a film that will be directed by K S Ravikumar. The latest reports say that Sonakshi Sinha has also been signed for this film. The film will be having two heroines. One is Anushka Shetty and the other is Sonakshi Sinha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu