Just In
- 9 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 10 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 10 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
- 11 hrs ago
బైక్ పై స్టార్ హీరో వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎంత దూరం వెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss!
- Sports
రోహిత్ ఔట్.. గిల్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?
- News
గర్జించబోతున్న కేసీఆర్... 'కమ్ బ్యాక్' కోసం భారీ బహిరంగ సభ... ఈసారి తిరుగులేని వ్యూహంతో?
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కు కరోనా పాజిటివ్.. వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు
కరోనావైరస్ బారిన పడిన ప్రముఖుల ఖాతాలో దక్షిణాది హీరో శరత్ కుమార్ కూడా చేరారు. ఇప్పటికే ఈ జాబితాలో డాక్టర్ రాజశేఖర్ దంపతులు, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, రాజమౌళి కుటుంబ సభ్యులు, విశాల్, నిక్కి గర్లానీ తదితరులు చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న శరత్ కుమార్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సతీమణి రాధిక శరత్ కుమార్ వెల్లడిస్తూ..

కొద్ది రోజులుగా అనారోగ్యంతో
నటి, నిర్మాత రాధిక శరత్ కుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ... కొద్ది రోజులుగా అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులను సంప్రదించారు. తాజాగా నిర్వహించిన రోగ నిర్ధారణ పరీక్షల్లో శరత్ కుమార్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది అని తెలిపారు.

హైదరాబాద్‌లో చికిత్స
శరత్ కుమార్ ఆరోగ్యం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. ఆయనకు కరోనా లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ మంచి వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తాను అని రాధిక శరత్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

హీరోగా, రాజకీయ నేతగా, నిర్మాతగా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విభిన్నమైన నటుడిగా, హీరోగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొన్నారు. నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో పలు సినీ, టెలివిజన్ నిర్మాణాల్లో భాగం పంచుకొన్నారు. అంతేకాకుండా రాజకీయ నేతగా కూడా తమిళ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

శరత్ కుమార్ కెరీర్ ఇలా..
శరత్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. 2019లో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, భరత్ అనే నేను, సాక్ష్యం, దేవదాస్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో వానమ్ కొట్టమ్, పరింధాల్ ప్రజాశక్తి, అందగత్తే, మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటిస్తున్నారు.