»   » మహారాణి పాత్రలో నటించబోతున్న శ్రీదేవి?

మహారాణి పాత్రలో నటించబోతున్న శ్రీదేవి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీదేవి ఆ తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆ మధ్య ఆమె పలు చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.....అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని తేలి పోయింది.

తాజాగా ఓ తమిళ చిత్రానికి సంబంధించి శ్రీదేవి పేరు వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించబోయే సినిమాలో శ్రీదేవి నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈచిత్రం సోసియో ఫాంటసీ జేనర్లో తెరకెక్కబోతోందని, ఈచిత్రంలో శ్రీదేవి మహారాణి పాత్రలో నటించబోతున్నట్లు చెబుతున్నారు.

Sridevi in a princess role?

మరో విషయం ఏమిటంటే 'ఈగ' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటుడు సుదీప్....ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఏఆర్ రెహమాన్‌తో కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర చేయించబోతున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారట.

హన్సిక, శృతి హాసన్‌లను హీరోయిన్లుగా ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 'కత్తి' చిత్రం తర్వాత ఈచిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు. అయితే వినడానికి మాత్రం ఈ చిత్ర విశేషాలు నమ్మశక్యంగా లేవు. త్వరలో పూర్తి వివరాలు అఫీషియల్‌గా వెల్లడి కానున్నాయి.

English summary
Chimbudevan’s Vijay 58 has been making news in tinsel town right from the moment of announcement of the project. The latest we hear is that Sridevi is donning the role of a princess in the fantasy flick. The movie also marks Sandalwood actor Sudeep’s straight debut in K’town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu