»   » అనారోగ్యానికి గురైన రజనీకాంత్‌.. శ్రీదేవి ఏం చేసిందో తెలిస్తే..గుండె బరువెక్కడం ఖాయం

అనారోగ్యానికి గురైన రజనీకాంత్‌.. శ్రీదేవి ఏం చేసిందో తెలిస్తే..గుండె బరువెక్కడం ఖాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలో గ్లామర్ క్వీన్ శ్రీదేవిది ఘనమైన చరిత్రే ఉంది. బాలనటిగా సినిమా రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా దేశంలోనే విలక్షణమైన నటిగా ఎదిగింది. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను, ఎంతో మంది అగ్రనటులతో పనిచేసింది. లేడి సూపర్‌స్టార్ హోదాను సంపాదించుకొన్నప్పటికీ ఆమె హృదయం మాత్రం చాలా సున్నితమైందే. తోటి నటీనటుల కోసం ఆమె ఎంత పరితపిస్తారో అని చెప్పడానికి సాక్ష్యంగా నిలిచే ఓ సంఘటన జరిగింది. రజనీ ఆరోగ్యం మెరుగుపడాలని వారం రోజులు ఉపవాసం చేసిందట.

రజనీకాంత్‌తో 20 చిత్రాలు

రజనీకాంత్‌తో 20 చిత్రాలు

రజనీ అనారోగ్యం గురించి తెలుసుకొని శ్రీదేవి ఆందోళనకు గురైంది. ఎందుకంటే వారి మధ్య ఎంతో అన్యోన్యంగా కలిసి నటించారు. దాదాపు రజనీతో శ్రీదేవి 20 చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

రజనీకి అనారోగ్యం

రజనీకి అనారోగ్యం

రాణా షూటింగ్ సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. వెంటనే చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఆరోగ్య సమస్య తగ్గకపోగా మరింత పెరిగింది. దాంతో మెరుగైన చికిత్స కోసం రజనీని సింగపూర్‌‌కు తరలించారు.

వారం రోజులు ఉపవాసం

వారం రోజులు ఉపవాసం

రజనీ ఆరోగ్యం త్వరగా మెరుపడాలని కోరుతూ షిర్డీ సాయిబాబాను కోరిందట. దాదాపు వారం రోజులపాటు ఉపవాసం చేసిందట. రజనీ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే ఆమె స్థిమితపడిందట.

సాయిబాబా మందిరానికి వెళ్లి

సాయిబాబా మందిరానికి వెళ్లి

రజనీకాంత్ ఆరోగ్యం మెరుపడిన తర్వాత పుణేలోని సాయిబాబా మందిరానికి వెళ్లి మొక్కు చెల్లించుకొన్నదట. ఆ విషయాన్ని ఆలయాన్ని సందర్శించిన తర్వాతే తన సన్నిహితులకు చెప్పిందట.

శ్రీదేవి మరణంతో రజనీకాంత్

శ్రీదేవి మరణంతో రజనీకాంత్

తన అత్యంత ఆప్తురాలైన శ్రీదేవి మరణ వార్త తెలిసి రజనీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. భారతీయ సినిమా పరిశ్రమకు తీరని లోటు. నా జీవితంలో నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. వారిలో శ్రీదేవి ఒకరు. ప్రస్తుతం ఆమె లేరనే వార్తతో నా హృదయం భారంగా మారింది అని తన సంతాప సందేశంలో రజనీ పేర్కొన్నారు.

కడసారి దర్శించుకొన్న రజనీకాంత్

కడసారి దర్శించుకొన్న రజనీకాంత్

శ్రీదేవి మరణ వార్త నేపథ్యంలో సోమవారమే రజనీకాంత్ ముంబైకి చేరుకొన్నారు. శ్రీదేవి మృతదేహం ఆలస్యమైన రజనీకాంత్ అక్కడే ఉన్నారు. శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకొన్న తర్వాత ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల్లోనూ ఆయన పాల్గొన్నట్టు సమాచారం.

English summary
Sridevi's sudden passing away has left the entire nation in deep shock. Bollywood has indeed lost a shining star whose enigmatic persona and impressive acting prowess has always made a special place in our hearts. One such incident revolved around superstar Rajinikanth. superstar Rajinikanth fell seriously ill while he was shooting for his film Rana co-starring Deepika Padukone. She made a vow to Shirdi's Sai Baba and took a fast for a week to pray for Rajini's speedy recovery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu