»   »  ఆ హీరోలిద్దరిని విమర్శిస్తూ ట్వీట్స్ చేయలేదు

ఆ హీరోలిద్దరిని విమర్శిస్తూ ట్వీట్స్ చేయలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ స్టార్ హీరో శింబును తాను విమర్శించలేదని మరో హీరో శ్రీకాంత్‌ తెలిపారు. శింబు, అజిత్‌లకు సంబంధించి ట్విట్టర్‌లో నటుడు శ్రీకాంత్‌ వ్యాఖ్యలు చేసినట్లు పలు ట్వీట్‌లు ప్రత్యక్షమయ్యాయి. అయితే తన ప్రమేయం లేకుండా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అలా చేస్తున్నారని శ్రీకాంత్‌ ఆరోపించారు.

ఈ విషయమై శ్రీకాంత్‌ మాట్లాడుతూ ...నేను ట్విట్టర్‌లో లేను. నటుడు శింబు గురించి ట్విట్టర్‌ అకౌంట్‌లో వస్తున్న ట్వీట్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఇదివరకు నేను ట్విట్టర్‌లో ఖాతా కూడా ప్రారంభించలేదు. ఎవరో నా పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ చేసి అలా చేస్తున్నారు. శింబు నా సన్నిహిత మిత్రుడు. అజిత్‌, శింబు అభిమానుల గురించి ఎలాంటి విమర్శలు చేయాల్సిన ఆవసరం నాకు లేదు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళ హీరో శింబు నటించిన ‘వాలు' చిత్రం చాలా కాలంగా విడుదల సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన సమస్యలు తీరిపోయి విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా విడుదల విషయంలో తమిళ స్టార్ విజయ్ చాలా హెల్ప్ చేసాడని అంటుననాడు శింబు తండ్రి టి. రాజేందర్ ‘వాలు' విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఈ నెల 14న విడుదల చేసారు.

Srikanth clarifies that he is not on twitter and any tweets attributed to Shimbu

కొన్నాళ్లుగా శింబుకు కాలం కలసి రావడం లేదు. ఓ వైపు వరుస పరాజయాల వెక్కిరిస్తుంటే.. మరోవైపు నటించిన సినిమాలు విడుదల కాకుండా ఇబ్బంది పెడుతున్నాయి. శింబు హీరోగా నటించిన తాజా చిత్రం వాలు.... ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది. కొడుకు కెరీర్ ను దారిలో పెట్టేందుకు నడుం బిగించిన రాజేందర్.. తానే స్వయంగా ఈ సినిమాను తమిళనాడు అంతటా విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు.

అయితే.. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి తమిళ .. కన్నడ .. కేరళ .. పాండిచ్చేరి ప్రదర్శన హక్కులను తాము కొనుగోలు చేశామంటూ... మ్యాజిక్ రేస్ అనే సంస్థ కోర్టుకెక్కింది. కోర్టు ఈ కేసును ఈ నెల 13కు వాయిదా వేయడంతో.. అనుకున్న తేదీకి ఈ సినిమా విడుదలవుతుందా లేదా సందిగ్ధం నెలకొంది.
వాలు సినిమా విడుదల కాకపోవడం వెనుక.. భారీ కుట్ర జరుగుతోందంటున్నారు శింబు తండ్రి రాజేందర్. ఈ సినిమా విషయం కోర్టులో ఉండగా.. ఎలాంటి తీర్పులు వెలువడకుండానే ఈ సినిమా విడుదల ఆగిపోయిందని.. తమిళనాట జరుగుతున్న ప్రచారంపై రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు.

శింబు సినీ క్రియేషన్స్‌పై ‘వాలు' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తానే విడుదల చేయబోసామని, తమిళనాడులో 300 థియేర్లలలో విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రం విడుదలకు విజయ్‌ చేసిన సాయం ఎప్పటికీ మరువలేనని, తోటి కళాకారుడికి సహాయం చేసే గొప్ప మనసు ఉందని, ఆయన చేసిన సాయం ఆర్థికపరమైనది కాదే, నైతిక మద్ధతు మాత్రమేనని స్పష్టం చేశారు. విజయ్‌ ‘పులి' విడుదలకు ఎటువంటి సాయం అవసరమైనా చేసేందుకు సిద్ధమన్నారు టి రాజేందర్.

శింబుపై కుట్ర జరుగుతోందని, తన చిత్రాన్ని విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని నటుడు, నిర్మాత అయినత టి.రాజేంద్రన్ గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, హన్సిక, సంతానం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల లేటవుతుడటంతో శింబు అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.'

English summary
Actor Srikanth clarifies to media that he is not on twitter and any tweets attributed to him about iam_str are from a fake id. Now, actor Srikanth who doesn't want any controversy has released a official press statement, clarifying that he doesn't have a twitter account and the ones which are pretending are fake ones."Dear Friends, I would like to inform u that I have never been on Twitter and don't have a Twitter ID of mine , it's a fake Twitter ID."
Please Wait while comments are loading...