Just In
- 20 min ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
- 31 min ago
అలా చేయడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు.. కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు
- 56 min ago
మెహబూబ్ గుట్టు విప్పిన సోహెల్: అందుకే పైకి అలా కనిపిస్తున్నాడంటూ మేటర్ రివీల్ చేశాడు
- 1 hr ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Sports
BWF World Tour Finals 2021: శుభారంభం దక్కలేదు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సింధు, శ్రీకాంత్ ఓటమి!
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలకృష్ణపై తమిళ స్టార్ కమెడియన్ సెన్సేషనల్ ట్వీట్.. అలా అనేశాడేంటి..

టాలీవుడ్‌లో వీర లెవెల్లో డైలాగ్ కొట్టాలంటే బాలకృష్ణకే సాధ్యమంటారు ఆయన అభిమానులు. నరసింహనాయుడు, లెజెండ్, సింహా, పైసా వసూల్ లాంటి చిత్రాలు ఆయన డైలాగ్ సత్తాకు అద్దంపట్టాయి. 'నీకు కావాల్సి నేను. నాతో పెట్టుకో. పది మందితో రా.. పదికి పది పెంచుకొంటూరా.. కానీ జనంతో పెట్టుకోకు', 'కొడితే మెడికల్ టెస్టులకు మీ ఆస్తులు అమ్మినా సరిపోవు', 'ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్, అదర్స్ నాట్ అలౌడ్' అంటూ బాలకృష్ణ కొడితే థియేటర్లలో చప్పట్లు మోగాల్సిందే.

బాలకృష్ణ ఫైట్ చేస్తే
ఇక బాలయ్యబాబు ఫైట్స్ చేస్తే థియేటర్లు దడదడలాడాలి. అది కర్రసామైనా లేదా ఇంకా ఎలాంటి ఫైట్ అయినా సినిమాహాళ్లు ఈలలతో మారు మోగిపోవాల్సిందే. ఫైట్స్ చేయడంలో బాలకృష్ణది డిఫరెంట్ స్టయిల్.

సినీ ప్రముఖులు కూడా ఫ్యాన్సే
బాలకృష్ణకు కేవలం ప్రేక్షకులే కాదు. హీరోలు, కమెడియన్లు కూడా అభిమానులుగా ఉన్నారు. అందుకు సాక్ష్యంగా తమిళ స్టార్ కమెడియన్ వివేక్‌ను చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గురించి తాజాగా వివేక్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు వివేక్ ఏమన్నారంటే..
|
వివేక్ ట్వీట్ ఇదే
నా మనసు బాగా లేకుంటే నేను రెండు పనులు చేస్తాను. ఒకటి స్వామి వివేకానంద పుస్తకాలు చదువుతాను. రెండు బాలకృష్ణ డైలాగులు వింటాను, ఫైట్స్ చూస్తాను. ఈ రెండు నాకు మంచి ఎనర్జీని ఇస్తాయి అని వివేక్ ట్వీట్ చేశారు.

వివేక్ ట్వీట్ వైరల్
వివేక్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తున్నది. ఆయన ట్వీట్ 1200 సార్లు రీట్వీట్ అయింది. సుమారు 10 వేల మంది లైక్ చేశారు. చాలా కామెంట్స్ వస్తున్నాయి. బాలకృష్ణ అంటే మరీ అంతే..