'ఈగ' సుదీప్ విలన్ గా ఖరారు
చెన్నై : కన్నడ నాట మినిమం గ్యారెంటీ హీరోగా ముద్రపడిన సుదీప్‌ను 'ఈగ' ద్వారా టాలీవుడ్‌కు విలన్ గా పరిచయం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడాయనకు మరో చిత్రంలో విలన్ గా అవకాసం వచ్చింది. విజయ్ హీరోగా తమిళంలో రూపొందే చిత్రంలో సుదీప్ ని తీసుకున్నారు. కథాపరంగా సుదీప్ అయితేనే.. విజయ్ పక్కన విలనిజానికి సరిపోతారని, అందుకే ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ విషయాన్ని సుదీప్ సైతం ఖరారు చేసారు.
సుదీప్ మాట్లాడుతూ... "ఈగ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, అయితే నేను సరైన ప్రాజెక్టునే ఎంచుకోవాలని ఆగాను. నాకేమీ అర్జెంటు గా సినిమాలు చేసేయ్యాలని లేదు. శింబుదేవన్ నన్ను ఓ రెండు నెలల క్రితం ఓ స్రిప్టుతో కలిసారు. నేను నా కన్నడ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాను. అయితే వారు వేరే వారిని తీసుకోకుండా నా కోసం వెయిట్ చేసారు. అప్పుడు వారు నన్నే అనుకుని ఆ క్యారెక్టర్ రాసుకున్నారని అర్దమైంది.." అన్నారు.
అలాగే చిత్రం గురించి చెప్తూ సుదీప్ "అది హిస్టారికల్ చిత్రం కాదు...ఓ ఫాంటసీ చిత్రం. ఓ కొత్త జెనర్ చిత్రం. నన్ను విలన్ గా చెయ్యమని అడగకుండా దర్శకుడు ఓ మంచి పాత్రలో ఎప్రోచ్ అయ్యారు ." అన్నారు.

విజయ్ సరసన నటించేందుకు బాలీవుడ్ భామ దీపికా పదుకొనెతోపాటు శ్రుతిహాసన్ పేర్లను పరిశీలిస్తున్నారు. అలనాటి అగ్రనటి శ్రీదేవి ఓ కీలక పాత్రలో నటించనుంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని శింబుదేవన్ సన్నిహితులు పేర్కొన్నారు.
ఇక సుదీప్ ఎన్నికకు కారణం చెప్తూ... విలన్ ని తెరపై చూపించడంలో దర్శకుల తీరు మారింది. హీరోకు దీటుగా స్త్టెలీష్‌గానే కనపడేవారినే ప్రస్తుతం విలన్లుగా ఎంపిక చేస్తున్నారు. మరోవైపు ఏకంగా హీరోలే ఇలాంటి పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కోలీవుడ్‌లో విలన్‌గా ఎంపిక చేసాం అన్నారు.


Click it and Unblock the Notifications











