twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పురాణ స్త్రీలపై నృత్య రూపకంలో ప్రత్యేక పాత్రలో...

    By Srikanya
    |

    చెన్నై: వాసవీ, ఆండాల్‌, కన్నగి... ఈ ముగ్గురూ దక్షిణాదిన పురాణాల్లోని పుణ్య స్త్రీలు. ఒకొక్కరు ఒక్కో ప్రత్యేకత కలిగిన వారు. వారి వ్యక్తిత్వం నేటి ఆధునిక స్త్రీలకూ ఎంతో అవసరం. చాలా మందిలో ఈ వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. వాటిని నేటి తరానికి అర్థమయ్యేలా పరిచయం చేయడానికి 'అంతరం' పేరిట ఒక ప్రత్యేక నృత్య రూపకాన్ని రూపొందించారు.

    కూచిపూడి, భరతనాట్యం, మోహినీహట్టం నృత్య సంప్రదాయాల్లో ప్రదర్శించే ఈ నృత్య రూపకం గురించి ప్రముఖ సినీ నటి సుహాసినీ మణిరత్నం సోమవారం మీడియా సమావేశంలో వివరించారు. ఇందులో తాను ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రముఖ నృత్యకారిణిలు యామినీరెడ్డి, క్రితికా సుబ్రమణియన్‌, గోపికావర్మలు.. వాసవి, కన్నగి, ఆండాల్‌ పాత్రల్లో అభినయిస్తారన్నారు.

    పురాణాల్లోని ఈ స్త్రీలు ఒకొక్కరిదీ ఒక్కో భిన్న ధృక్పథమన్నారు. ఆండాల్‌ నాటి సామిజిక కట్టుబాట్లను ఎదురించి నిలబడితే, వాసవీ జీవితాన్ని సేవకే అంకితం చేశారని, ఇక కన్నగి న్యాయం కోసం పోరాడిన పుణ్య స్త్రీమూర్తి అన్నారు. వారందరూ ఇప్పటి తరానికీ ఆదర్శప్రాయమైన వారేనని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శించబోతున్నట్లు సుహాసిని చెప్పారు.

    Suhasini Maniratnam at Antaram Press Meet

    ఈ నెల 28న మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీలో తొలి ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క్రితిక సుబ్రమణియన్‌, గోపికావర్మ పాల్గొన్నారు.

    English summary
    Antaram is jointly produced by Krithika Subrahmanian of Namaargam Dance Company and Suhasini Mani Ratnam of Talent South, which will be staged on Friday 28th,November 2014 Academy by 6.30 pm. Antaram is that which lies within. Internalised. Intrinsic. It is mystique, feminine manifestations or attributes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X