»   » దర్శకుడు, హీరోయిన్ పెళ్లి లొల్లి, పోలీసుల విచారణ!

దర్శకుడు, హీరోయిన్ పెళ్లి లొల్లి, పోలీసుల విచారణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sujibala files death threat complaint against director
హైదరాబాద్: తమిళ హీరోయిన్ సుజిబాల, దర్శకుడు రవికుమార్ మధ్య చెలరేగిన పెళ్లి వివాదం ఇపుడు పోలీసుల వరకు వెళ్లింది. సుజిబాలను తాను పెళ్లాడానని, తమను విడదీయడానికి కొందరు కుట్ర జరుగుతోందంటూ ఇటీవల రవికుమార్ మీడియాకు వెల్లడించారు.

ఈ అంశంపై రవికుమార్ మీడియాకెక్కడంపై హీరోయిన్ సుజిబాల ఫైర్ అయ్యారు. రవికుమార్‌ తన వ్యవహారం నిశ్చితార్థం వరకు వెళ్లిన మాట వాస్తవమే అని, అయితే పెళ్లి జరుగలేదని సుజిబాల తెలిపారు. రవికుమార్‌కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని, అందుకే అతనితో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.

అప్పటి నుండి రవికుమార్ తనను వేధిస్తున్నారని, తాను సినిమాల్లో నటించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇటీవల తనపై దాడి చేసాడని సుజిబాల ఆరోపించారు. దర్శకుడు రవికుమార్ మూలంగా తనకు ప్రాణహాని ఉందని సుజిబాల పోలీసులకు ఫిర్యాదు చేసారు.

తనకు మామిడితోట కొనిచ్చినట్లు రవికుమార్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సుజిబాల స్పష్టం చేసారు. రవి కుమార్‌ను ఎంతగానో నమ్మానని, అందుకే అతనితో నిశ్చితార్థం వరకు వెళ్లాను, కానీ అతనికి అప్పటికే పెళ్లయిన విషయం తెలిన తర్వాత అతని చేతిలో మోసపోయాననే విషయం అర్థమైందని సుజిబాల చెప్పుకొచ్చారు.

English summary
Actress Sujibala, who's acted in Tamil films like Goripalayam, Chandramukhi and Muthukku Muthaaga, has filed a police complaint against director P Ravikumar, alleging that the latter has been issuing death threats to her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu