'మగధీర' లాంటి హిస్టారికల్ ప్రాజెక్టు చేస్తున్నా

By Srikanya

చెన్నై:ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ .సి ..హర్రర్ సినిమాలకు, కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన త్వరలో ఓ హిస్టారికల్ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నారు. ఆ చిత్రం భారీ బడ్జెట్ తో లావిష్ గా ఉంటుందని చెప్తున్నారు.

ఆ చిత్రం యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... సినిమా మగధీర తరహాలో ఉంటుందని, హిస్టారికల్ సబ్జెక్ట్ అని తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందనున్న చిత్రం అని చెప్తున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతుందని చెప్పారు.

Sundar's Next Will Be A Big-budget Historical Film

హీరో ఎవరనేది ఓ వారంలో ఫైనలైజ్ అవుతుందని, విజువల్ ఎఫెక్ట్ లకు ఆర్ సి కమలాకరన్ ని ఎంచుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణమని చెప్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తో నిండి ఉంటుందని, సుందర్ సి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని భావించి, కమలాకరన్ ని రప్పించారని చెప్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే రెండు నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా రాజుల కథగా సాగుతుందని , వీరత్వం ప్రధానంగా ఉంటుందని చెప్తున్నారు. మరి సుందర్ సి ఈ సినిమాతో ఏ స్దాయిలో హిట్ కొడతారో చూడాలి. హిట్ అయితే ఇక్కడకు కూడా ఎలాగో డబ్ చేస్తారు కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X