twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్ రోషన్ రజనీ మూవీతోనే మొదలు పెట్టాడు

    హృతిక్ రోషన్ కి మొట్ట మొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం. అప్పుడు హృతిక్ వయసు 12 సంవత్సరాలు.

    By Bojja Kumar
    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే యావత్ భారతదేశం లో క్రేజ్ ఉన్న వ్యక్తి. అటువంటి స్టార్ మన్ననలను పొందటం బాలీవుడ్ హీరో ల కు కూడా గర్వకారణం. ఇప్పుడు రజనీకాంత్ ప్రశంశలను అందుకోవటం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వంతు అయింది.

    హృతిక్ నటించిన "బలం" చిత్రం ట్రైలర్ ల ను, పాటలను చూసిన రజినీకాంత్, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. హృతిక్ నటనను, ప్రతిభ ను ఆయన ప్రత్యేకం గా పొగిడారు. ఈ వార్త విన్న హృతిక్ రోషన్ ఎంతగానో ఆనందించి రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

    Balam

    రజినీకాంత్, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ల ది 30 సంవత్సరాల గా కొనసాగుతోన్న బంధం. హృతిక్ రోషన్ తాత గారు జె ఓం ప్రకాష్ తీసిన "భగవాన్ దాదా" చిత్రం తో వీరిద్దరి బంధం ఏర్పడింది. ఆశక్తి కర విషయం ఏమిటంటే, హృతిక్ రోషన్ కి మొట్ట మొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం. అప్పుడు హృతిక్ వయసు 12 సంవత్సరాలు.

    ప్రపంచ వ్యాయాప్తం గా జనవరి 25 న కాబిల్ విడుదల కాబోతోంది. ఇదే చిత్రం తెలుగు లో బలం గా వస్తోంది. హృతిక్ , యామి జంటగా నటించిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ను సంజయ్ గుప్తా డైరెక్ట్ చేయగా, రాకేష్ రోషన్ నిర్మించారు. రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం లో హృతిక్, యామి ఇద్దరు అంధులు గా నటించటం విశేషం.

    English summary
    Superstar Rajinikanth and filmmaker Rakesh Roshan go a long way. Their association was cemented with the 1986 film "Bhagwaan Dada" that was directed by Hrithik Roshan's maternal grandfather J Om Prakash and produced by Rakesh Roshan . It was a film in which Hrithik, who was 12 then, had his first speaking part.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X