For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెర్సల్ మీద రజినీ స్పందన, ముక్తసరిగా: బీజేపీకే ఆయన మద్దతా?? అయోమయం లో అభిమానులు

  |

  తాజా తమిళ చిత్రం 'మెర్సల్‌' చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. ఈ చిత్రంలో జీఎస్టీ, నోట్లరద్దుపై, భారత్‌లో వైద్య విధానంపై చిత్రీకరించిన కొన్ని సంభాషణలు వివాదాస్పదంగా మారాయి. దీంతో బీజేపీ, బీజేపీయేతర పక్షాల మధ్య వివాదం రాజుకుంది. చిత్రంలో జీఎస్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని.. వెంటనే వీటిని తొలగించాల్సిందేనని బీజేపీ డిమాండ్‌ చేసింది. 'మెర్సల్‌' ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను విమర్శించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డిజిటల్‌ ఇండియా, జీఎస్టీ అంశాలను విమర్శించేలా సంభాషణలు వివాదాస్పదంగా మారాయి.....

  దేశ ప్రజలకు ఉచిత వైద్యం

  దేశ ప్రజలకు ఉచిత వైద్యం

  దేశ ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న మంచి ఉద్దేశాన్నే ‘మెర్సల్‌' వ్యక్తపరిచినప్పటికీ, అందుకోసం ప్రయోగించిన సంభాషణలు సంచలనంగా మారాయి. 8 శాతం జీఎస్టీ విధిస్తున్న సింగపూర్‌ వంటి దేశాల్లో ఉచిత వైద్యం అందిస్తున్నప్పుడు, 28 శాతం జీఎస్టీ విధిస్తున్న మన దేశంలో ఉచిత వైద్యం ఎందుకు సాధ్యం కాదని హీరో ప్రశ్నిస్తాడు. ఆ సంభాషణలపై బీజేపీ రాష్ట్ర నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  "మెర్సల్" మద్దతుగా కమల్, రాహుల్‌.. పా రంజిత్ ట్వీట్స్..
   సంస్కృతితో మమేకమైన తమిళ సినిమా

  సంస్కృతితో మమేకమైన తమిళ సినిమా

  అయితే.. సంస్కృతితో మమేకమైన తమిళ సినిమాను అగౌరవపరచకూడదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ ట్వీటర్‌లో విమర్శించారు. ఇక కోలీవుడ్ హీరో కమల్ హాసన్ కూడా మెర్సల్‌ కే తన మద్దతు అంటూ తన అభిప్రాయం చెప్పేసాడు, సెన్సార్ బోర్డ్ చూసి అభ్యంతరం చెప్పని సినిమాలోని దృశ్యాలను తొలగించొద్దని కమల్‌ హాసన్‌ సూచించాడు.

   శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌

  శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌

  వివాదం ముదురుతుండటంతో.. మెర్సల్‌ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ వెనక్కు తగ్గింది. బీజేపీ డిమాండ్‌లో న్యాయముందని అంగీకరించిం ది. అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ‘భారత్‌లోని వైద్య విధానంలో నాణ్యతాలోపాలు.. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూపించాలనే ఉద్దేశంతోనే చిత్రం నిర్మించాం. ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు' అని చిత్ర యూనిట్‌ సభ్యుడు ఎన్‌ రామస్వామి స్పష్టం చేశారు.

  ప్రజా సమస్యలపై ప్రశ్నించడం

  ప్రజా సమస్యలపై ప్రశ్నించడం

  తాజాగా ఆ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఆ వివాదాలపై స్పందించారు. ‘మెర్శల్'లో చూపించినట్లుగా సమాజంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం అవసరమని ఆయన అన్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా వైద్యులు చేస్తున్న ప్రచారం వల్ల తమ సినిమాకు మరింత పబ్లిసిటీ కలుగుతోందని చెప్పారు.

  విజయేంద్ర ప్రసాద్

  విజయేంద్ర ప్రసాద్

  తాము సినిమాలో సామాజిక ఇబ్బందుల గురించి చెప్పడం తప్పుకాదని ఈ తరహా సినిమాలు మరిన్ని రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సింగపూర్ కన్నా భారత్ లో 21 శాతం అధికంగా జీఎస్టీ కడుతున్నప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నామని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ విషయాల్నే తమ సినిమాలో చూపించినట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

  జాతీయ స్థాయిలో నిరసనలు

  జాతీయ స్థాయిలో నిరసనలు

  అయితే బయట ఇంత జరుగుతున్నా సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఈ విషయం లో మౌనంగా ఉండిపోవటం విమర్శలకు తావిచ్చింది. ఒక పక్క మెర్సల్ అటు కలెక్షన్ల పరంగా దూసుకు పోతూనే ఉన్నా, రెండో పక్క ఈ సినిమా పై జాతీయ స్థాయిలో నిరసనలు, విమర్శలూ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయం లో రజినీ నోరు మెదపక పోవటం తో సినిమా రంగం నుంచే గుస గుసలు మొదలయ్యాయి.

  ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు

  ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు

  బీజేపీకే తన మద్దతు అంటూ రజినీ చెప్పదలుచుకున్నారా? అన్న వ్యాఖ్యలు కూడా రజినీ చెవిలో పడ్డాయట. దాంతో ఇక తప్పదనుకున్న రజినీ ఈ సినిమా మీద తన స్పందన చెప్పేసాడు. "ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు, చక్కగా తీసారు, మెర్సల్ టీమ్ మొత్తానికి అభినందనలు" అంటూ ట్విటర్ లో పోస్ట్ చేసాడు రజినీ కాంత్.

  ఏమీ మాట్లాడనే లేదు

  అయితే సినిమా బావుందీ అనటం వరకైతే స్పందన సరిపోతుంది గానీ, సినిమా మీద ఎదురయ్యే నిరసన విషయం లో ఏమీ మాట్లాడనే లేదు రజినీ, మెర్సల్ సినిమా మీద బీజేపీ, తమిళ డాక్టర్లూ వ్యక్తం చేస్తున్న నిరసనలమీద గానీ, వారు సినిమాలోని సన్నివేశాలు తొలగించాలంటూ చేసిన వ్యాఖ్యల విషయంలో గానీ రజినీకాంత్ స్పందించకపోవటం తో... సూపర్ స్టార్ ఏం చెబుతాడా అని చూసినవాళ్ళకి నిరాశగానే అనిపించింది.

  English summary
  Tamil superstar Rajinikanth today lauded the crew of actor Vijay's starrer 'Mersal', saying the film has addressed an important issue. "Important topic addressed... Well done !!! Congratulations team #Mersal" posted Rajini
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X