twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్వెల్ లేనట్లే, అందుకే ఆత్రేయ కుర్చీ ని అలా చేసారు

    By Srikanya
    |

    చెన్నై: సూర్య హీరోగా విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ '24'. విడుదలయ్యాక మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా సినిమా చూసినవారు మాత్రం అందులో సూర్య చేసిన ఆత్రేయ పాత్రను మాత్రం మర్చిపోలేదు. ఆత్రేయ పాత్ర ఎప్పుడూ ఓ చక్రాల కుర్చీలో కూర్చుని ఉంటుంది.

    ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని, ఆత్రేయ టైటిల్ తోనే చిత్రం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తమిళంలో సినిమా అసలు వర్కవుట్ కాకపోవటంతో సూర్య ఆ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడు ఇక ఆత్రేయ వాడిన ఆ కుర్చీతో ఉపయోగం లేదు.

    suriya donates Athreya chair for a spinal foundation in chandigarh

    దాంతో ఆత్రేయ పాత్ర ఉపయోగించిన ఖరీదైన చక్రాల కుర్చీని సూర్య చండీగఢ్‌లోని ది స్పైనల్‌ ఫౌండేషన్‌ అనే సంస్థకు విరాళంగా ఇచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ కుర్చీని న్యూ చండీగఢ్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ జులై 10న ప్రారంభించనున్న రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో వాడనున్నారు.

    ఎక్కువగా పక్షవాత వ్యాధితో బాధపడుతున్న వారికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించేందుకు ఫౌండేషన్‌ నిర్ణయించిందట. ఈ సందర్బంగా సూర్యకు స్పైనల్‌ ఫౌండేషన్‌ సోషల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో కూడా సూర్య సహాయం ఇలాగే కొనసాగాలని ఫౌండేషన్‌ కోరింది.

    ఇక ఈ చిత్రంలో సూర్య.. మణి, సేతురామన్‌, ఆత్రేయ అనే మూడు పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులతోపాటు విమర్శకుల మన్ననలు పొందారు. టాక్ ఎలా ఉన్నా ఓ మంచి చిత్రంలో చేసారన్న పేరైతే వచ్చింది.

    English summary
    Surya's Atreya wheel chair got a rare honor. Buzz is Surya donated the wheel chair to The Spinal Foundation in Chandigarh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X