twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిచ్చమెత్తుకుని అయినా.. ఎంతో మంది ఎగతాళి చేశారు.. స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న హీరో

    |

    Recommended Video

    Suriya Get Emotional In Agaram Foundation Book Launch Event

    తమిళ హీరో సూర్య.. తెలుగు నాట మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. తెలుగు సినిమా హీరోల మాదిరిగానే సూర్య చిత్రాలను కూడా ఆదరిస్తారు. అయితే సూర్య గత కొంత కాలంనుంచి సరైన హిట్ కొట్టలేక వెనుకబడిపోయాడు. సినిమాల విషయం కాసేపు పక్కన బెడితే.. సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం ముందుంటాడు సూర్య. అగరం ఫౌండేషన్ అనే స్థాపించి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాడు.

     పేద విద్యార్థులకు చదువు..

    పేద విద్యార్థులకు చదువు..

    అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నాడు. గత పదేళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్‌ను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇటీవల చెన్నైలో అగరం ఫౌండేషన్‌ తరఫున రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రి అనే అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. తన చదువుకు అగరం ఫౌండేషన్‌ ఎలా సహాయం చేసిందో వివరించింది.

    బిచ్చమెత్తుకుని అయినా..

    బిచ్చమెత్తుకుని అయినా..

    ‘మాది తంజావూరులోని ఓ చిన్న పల్లెటూరు. పదో తరగతి వరకు ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అమ్మ దినసరి కూలీగా పనిచేసేది. నాన్న క్యాన్సర్‌తో బాధపడుతుండేవారు. అయితే పదో తరగతి పూర్తయ్యాక.. ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కూలీ పనికి పోతానని అమ్మకు చెప్పాను. కానీ అమ్మ మాత్రం మా లాగా నువ్వు కష్టపడకూడదు.. బిచ్చమెత్తుకోని అయినా నన్ను చదివిస్తానని చెప్పింది.

    ఎంతో మంది ఎగతాళి..

    ఎంతో మంది ఎగతాళి..

    ఆ తర్వాత నేను అగరం ఫౌండేషన్‌లో చేరాను. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్న చనిపోయారు. అప్పుడు చదువు మానేద్దామని అనుకున్నాను. నీ కోసం నువ్వు చదవాలని అమ్మ చెప్పింది. చాలా మంది ఇక్కడ నన్ను ఎగతాళి చేశారు. అగరం సాయంతో కాలేజీ విద్యను పూర్తిచేశాను. ఆ తర్వాత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. నా జీవితంలో వెలుగులు నింపిన అగరానికి, సూర్య అన్నకు కృతజ్ఞత తెలుపుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను' అని గాయత్రి తెలిపారు.

    వేదికపైనే కన్నీరు..

    వేదికపైనే కన్నీరు..

    అయితే గాయత్రి తన కథ చెబుతున్న సమయంలో వేదికపైనే ఉన్న సూర్య భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీటిని ఆపుకోలేకపోయాడు. గాయత్రి వద్దకు వచ్చి అప్యాయంగా పలకరించడంతో పాటు ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు సూర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    English summary
    Suriya Get Emotional On Agaram Foundation Book Launch Event. Now He Is Busy With Surarai Pottru, Vetri Maran Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X