»   » ఆడవాళ్ళకి మాత్రమే సినిమా పోస్టర్ దుమ్మురేపుతోంది: మగళైర్ మట్టుం పోస్టర్ పై ఆసక్తి

ఆడవాళ్ళకి మాత్రమే సినిమా పోస్టర్ దుమ్మురేపుతోంది: మగళైర్ మట్టుం పోస్టర్ పై ఆసక్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక మరో విభిన్న పాత్రలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. హీరో సూర్యతో వివాహం తరువాత నటనకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్యూటి 2015లో రిలీజ్ అయిన 36 వయదినిలే సినిమాతో తిరిగి వెండితెర మీద సందడి చేసింది.ఆ తర్వాత జ్యోతిక నటిస్తున్న కొత్త సినిమా ' మగలిర్‌ మట్టుమ్‌'. ఆడవాల్లకు మాత్రమే అనేది ఈ టైటిల్‌కు అర్థం.

మహిళా సమస్యలపై పోరాడే యువతిగా

మహిళా సమస్యలపై పోరాడే యువతిగా

డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ పాత్రలో కనిపించనుంది జ్యోతిక. లఘు చిత్రాల రూపకల్పనతో మహిళా సమస్యలపై పోరాడే యువతిగా జ్యోతిక నటిస్తోంది. టూడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జ్యోతిక భర్త సూర్య ‘ మగలిర్‌ మట్టుమ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెబల్‌ మాదిరి పాత్ర

రెబల్‌ మాదిరి పాత్ర

ప్రధానంగా అన్నీ లేడీ క్యారెక్టర్లే కనిపించే ఈ చిత్రంలో జ్యోతిక ఒక రెబల్‌ మాదిరి పాత్ర చేసింది. జ్యోతిక లుక్‌, గెటప్‌తోనే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకున్న జ్యోతిక చాలా మంచి స్క్రిప్ట్‌ ఎంచుకుందని, నటిగా ఈ చిత్రం తనకి మరింత మంచి పేరు తెస్తుందని విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దర్శకుడు బ్రహ్మ

దర్శకుడు బ్రహ్మ

సర్వత్రా ప్రశంసలు అందుకుంటోన్న ఈ చిత్రం కమర్షియల్‌గాను సక్సెస్‌ అవుతుందో లేదో చూడాలి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న దర్శకుడు బ్రమ్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊర్వశి, శరణ్య, భానుప్రియ, నాజర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌ లో తొలిసారి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుం టోంది జ్యోతిక.

గ్లామర్‌ సినిమాలకు దూరం

గ్లామర్‌ సినిమాలకు దూరం

ప్రభావవంతంగా పాత్రలో నటించాలంటే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలనే భర్త సూర్య సూచనపై జ్యోతిక ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ఎంపికతో..పెళ్లైన తర్వాత తాను గ్లామర్‌ సినిమాలకు పూర్తిగా దూరమని జ్యోతిక స్పష్టం చేసింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

మరోసారి సూర్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈసినిమాకు బ్రహ్మ దర్శకుడు. దసరా సందర్భంగా సూర్య.., ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. జ్యోతికతో పాటు సీనియర్ నటీమణులు శరణ్య, భానుప్రియ, ఊర్వశిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తమిళం తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

English summary
Actor Suriya on Sunday released the second poster of his wife Jyotika-starrer upcoming Tamil drama M...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu