»   » 'సింగం 3' రిలీజ్ కన్ఫూజన్ :తెలుగు నిర్మాత ఇలా,తమిళంలో నిర్మాత అలా...ఏది నిజం?

'సింగం 3' రిలీజ్ కన్ఫూజన్ :తెలుగు నిర్మాత ఇలా,తమిళంలో నిర్మాత అలా...ఏది నిజం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన 'సింగం 3' సినిమా, సంక్రాంతి పండుగకి ముందే విడుదల కావలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన విడుదల తేదీ వాయిదా పడింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే ప్రస్తుతం తమిళనాడులో 'జల్లికట్టు' విషయంపై వాతావరణం ఉద్రిక్తంగా వుంది. తమిళ ప్రజలందరి దృష్టి ఆ సమస్యపైనే వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ విషయంపై తాజాగా దర్శక నిర్మాతలు ట్విట్టర్ లో స్పందించారు.

'సింగం 3' సినిమా విడుదల వాయిదా పడనుందంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమాను ఈ నెల 26వ తేదీనే విడుదల చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో తమిళనాట ఈ సినిమాకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలంటున్నారు ట్రేడ్ ఎనాలసిస్ట్ లు. అయితే తెలుగు నిర్మాత మాత్రం వాయిదా వేస్తున్నామంటూ నిన్న మీడియాకు ఇఛ్చిన ప్రకటన అందరినీ కన్ఫూజన్ లో పడేస్తోంది.

Suriya's Singam 3 not postponed, producer rubbishes rumours

సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈనెల 26 న విడుద‌ల కావ‌ల‌సిన "S3-య‌ముడు-3 చిత్రం విడుద‌ల వాయిదా వేశాము. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంగా విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌ధ్యంలో త‌మిళ‌నాట కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్ని గ‌మ‌నించి, ఇది విడుద‌ల‌కి స‌రియైన స‌మ‌యం కాద‌ని త‌ల‌చి ఈ నిర్ణ‌యం తీసుకొవ‌టం జ‌రిగింది అన్నారు.

డైర‌క్ట‌ర్ హ‌రి గారు , సూర్య గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే చిత్రం కొసం తమిళ‌, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అంద‌రికి తెలుసు.. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం విడుద‌లని ఏప్ప‌టిక‌ప్ప‌డు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. మా త‌దుప‌రి విడుద‌ల తేది ని అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని నిర్మాత తెలిపారు.

English summary
On contrary to reports, the makers of Suriya's Singam 3 have confirmed the film's release, which is on January 26.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu