»   »  సూర్య “24” టీజర్ లీకైందా...? ఇదేంటి మరి..? (వీడియో)

సూర్య “24” టీజర్ లీకైందా...? ఇదేంటి మరి..? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌత్ ఇండియాలో కమల్ హాసన్ స్థాయిలో ప్రయోగాలు చేసే విలక్షణ నటుడు సూర్య. సక్సెస్,ఫెయిల్యూర్స్ లతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు సూర్య. అదే వరుసలో మరో ఎక్స్ పరిమెంటల్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. అదే "24".

అక్కినేని కుటుంబంతో ‘మనం' సినిమా చేసి తన టాలెంట్ ని చాటిచెప్పిన దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "24". సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం "24" టీజర్ ముందే లీక్ అయ్యిందంటూ ఓ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

అయితే కొందరు నిపుణులు మాత్రం అది ఈ సినిమాకు సంభందించిన లీకైన వీడియో కాదు, ఆ పేరుతో చలామణి అవుతున్న ఫేక్ వీడియో అంటున్నారు. కేవలం కొందరు తమ ఎడిటింగ్ పరిజ్ఞానంతో హాలీవుడ్ సినిమాలు, సూర్య సినిమాల్లో కొన్ని విజువల్స్ కట్ చేసి వదలారని చెప్తున్నారు. ఏది నిజమో తెలియాలంటే ఓ రోజు ఆగాల్సిందే. ఈ లోగా ఈ టాలెంట్ ని చూడండి మరి..

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కొన్ని పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. పోస్టర్స్ తోనే భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టీజర్ ఈ నెల 4వ తేదీ సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా ఒక అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు.

స్లైడ్ షోలో టీజర్ లో హైలెట్ గా నిలిచిన విజువల్స్

వేసవి కి..

వేసవి కి..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మూడు పాత్రల్లో

మూడు పాత్రల్లో


ఈ చిత్రంలో సూర్య మూడు డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

ఇద్దరు హీరోయిన్స్

ఇద్దరు హీరోయిన్స్


సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు.

నిర్మాతగా కూడా

నిర్మాతగా కూడా

ఈ మూవీని హీరో సూర్య నిర్మిస్తుండ‌డం విశేషం.

జానర్

జానర్

తమిళ,తెలుగు కు కొత్త అయిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోంది

రిలీజ్

రిలీజ్


తెలుగు, త‌మిళ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో

తెలుగులో

తెలుగులో 24 మూవీని హీరో నితిన్ రిలీజ్ చేయ‌నున్నారు.

అందుకే అంచనాలు

అందుకే అంచనాలు


'13 బీ', ‘ఇష్క్', ‘మనం' లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఇక్కడా అంచనాలు బాగున్నాయి.

క్రేజ్

క్రేజ్

ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన వినూత్న సినిమా కావడంతో '24' సినిమాకు తెలుగు, తమిళంలో అద్భుతమైన క్రేజ్ వచ్చింది.

ఎక్కడికో..

ఎక్కడికో..

ఇక ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసేలా ప్రత్యేక సందర్భాల్లో రిలీజ్ అవుతూ వస్తోన్న టీజర్ ... సినిమాపై ఉన్న అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళాయి.

టైమ్ ట్రావెల్

టైమ్ ట్రావెల్

ఈ సినిమా ట్రైమ్ ట్రావెల్ చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి

చిత్రం కథేంటి

చిత్రం కథేంటి

'24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ.

మూడు పాత్రలు ఇవే..

మూడు పాత్రలు ఇవే..

ఈ సినిమాలో సైంటిస్ట్ గా, అతని కొడుకుగా, ఆత్రేయ అనే విలన్ గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

అజయ్ సైతం

అజయ్ సైతం

ఈ సినిమాపై తెలుగు లో విలన్ గా పాత్రలు చేసే అజిత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు

ఇదో ప్రత్యేకత

ఇదో ప్రత్యేకత

సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందతూండటంతో ఈ సినిమాపై ఆయన నమ్మకం ఎంత ఉందనేది అంచనా వేస్తున్నారు

సంగీతం

సంగీతం

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

టీజర్ చూసినావాళ్లు

టీజర్ చూసినావాళ్లు

ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది..రహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అద్బుతం అనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

English summary
Much before the official release, few lucky ones have already witnessed the teaser of Suriya's upcoming film 24, and going by their collective reaction, the teaser will blow you away when it is made public on March 4 (Friday).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu