»   »  నెక్ట్స్ తెలుగులో వస్తున్న సూర్య సినిమా ‘మేము’(ట్రైలర్)

నెక్ట్స్ తెలుగులో వస్తున్న సూర్య సినిమా ‘మేము’(ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో సూర్య నటిస్తున్న తమిళ చిత్రం ‘పసంగ-2' తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మేము' పేరుతో తెలుగులో విడుదలవున్న ఈ చిత్రంలో సూర్య కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నారు. ఇదొక బాలల చిత్రం. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Surya's Pasanga 2 as 'Memu' in Telugu

సూర్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాండిరాజ్ చెప్పిక కథ నచ్చడం వల్లనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మొదట్లో తమిళంలోనే విడుదల చేయాలనుకొన్నారు. కానీ సూర్య - అమలాపాల్ లకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే తెలుగులోనూ సినిమాని విడుదల

చేస్తున్నారు.సినిమా సందేశాత్మకంగా ఉండటంతో పాటు కలర్ ఫుల్ ఉంటుందని, కేవలం పిల్లలకే కాదు పెద్దలకీ నచ్చుతుందని అంటున్నారు. ప్రయోగాత్మకంగా, సందేశాత్మకంగా ఉండే సినిమాలు తీయడానికే సూర్య స్వయంగా టుడీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓన్ ప్రొడక్షన్ కంపెనీ స్థాపించాడు. ఆ ప్రొడక్షన్ కంపెనీలో తొలి ప్రయత్నంగా చేసిన 36 వయదినిలే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గతంలో పాండి రాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ బాలల చిత్రం ‘పసంగ' మంచి విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పసంగ-2' చిత్రం కూడా మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు.

English summary
Surya's upcoming film Pasanga 2 releasing as 'Memu' in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu