For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'అనంతపురం' దర్శకుడుతో 'గజనీ' సూర్య చిత్రం ఖరారు

  By Srikanya
  |

  చెన్నై: తెలుగులో సైతం తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరో సూర్య. ఆయన తన తదుపరి చిత్రానికి ఓకే చేసారు. సుబ్రమణ్యపురం(తెలుగులో అనంతపురం) దర్శకుడు శశికుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'సెవెన్త్ సెన్స్'లో వైవిధ్య పాత్రలో అలరించిన సూర్య ఇటీవల విడుదలైన 'బ్రదర్శ్‌'లోనూ అవిభక్త కవలలుగా అద్భుత నటన ప్రదర్శించారు. విమర్శకులు ప్రశంసలు అందుకుంటూనే కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా వూపాడు.

  ఇక దర్శకుడు శశికుమార్‌ వెండితెరపైనా హీరోగా తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల 'సుందరపాండియన్‌'తో హీరోగా మరో హిట్‌ అందుకున్నాడు. 'సుందరపాండియన్‌' చిత్రం తెలుగు రైట్స్ ని బీమినేని శ్రీనివాస రావు తీసుకున్నారు. ఇక సూర్య ప్రస్తుతం 'సింగం-2' చిత్రీకరణలో తీరికలేకుండా ఉన్నాడు. ఆపై గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 'తుప్పరియుం ఆనందన్‌' చేయనున్నాడు. ఈ రెండింటి తర్వాత సూర్య-శశికుమార్‌ కాంబినేషన్‌లోని సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

  ఇటీవలే విడుదలైన బ్రదర్శ్ విషయానికి వస్తే... ఈ చిత్రం డివైడ్ టాక్ రావటంతో నిడివి 30 నిముషాలు పాటు కట్ చేసారు. ఈ విషయమై నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 'ద్వితీయార్ధం నిడివి ఎక్కువ అవ్వడంతో తొలిరోజు సినిమాకు కొంత డివైడ్ టాక్ వచ్చిన మాట నిజం. అందుకే సినిమా నిడివిలో 30 నిమిషాలు తగ్గించాం. స్క్రీన్‌ప్లేలో కూడా భారీగా మార్పులు చేశాం. ఈ మార్పులు జరిగాక సినిమాకు మంచి స్పందన వస్తోంది' అని బెల్లంకొండ సురేష్ అన్నారు.

  కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అవిభక్త కవలలుగా సూర్య నటించిన సినిమా 'బ్రదర్స్'. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ అనువాద చిత్రానికి బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేశ్‌బాబు నిర్మాతలు. ఈ సినిమా రిలీజైన తొలిరోజే లెంగ్త్ ఎక్కువ ఉందని ప్లాప్ టాక్ వచ్చింది. దాంతో వెంటనే నిర్మాతలు స్పందించి ఈ నిర్ణయం తీసుకుని సినిమాని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ''ప్రస్తుతం మన జీవితాలన్నీ కల్తీమయం అయిపోయాయి. దేశంలో ఎక్కడ చూసినా కల్తీ. విదేశాల నుంచి టెక్నాలజీతో పాటు, కల్తీ కూడా మనదేశానికి దిగుమతి అవుతోంది. ఆఖరికి చిన్నపిల్లలు తాగే పాలు కూడా స్వచ్ఛంగా లేవు. పిల్లలు తినే పాల పొడిని కూడా కల్తీ చేస్తున్న పరిస్థితి నేడు నెలకొంది. ఆ విషయాన్నే మా సినిమాలో చూపించాం. దైనందిన సమస్య కాబట్టే.. ప్రేక్షకులు కథలో త్వరగా లీనమయ్యారు'' అన్నారు బెల్లంకొండ సురేష్‌.

  కాజల్, వివేక్, సచిన్ కేడెకర్, తార, రవిప్రకాష్, శంకర్ కృష్ణమూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: ఎస్.సౌందర్యరాజన్, ఎడిటింగ్: ఆంథోని, పాటలు: చంద్రబోస్, వనమాలి, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌ బాబు, సమర్పణ: కె.ఇ.జ్ఞాన్‌వేల్ రాజా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్.

  English summary
  The latest buzz in Kollywood is that the Surya will be working with Subramaniapuram director Sasikumar. Apparently, the director had expressed a keen interest in working with the actor and met with him recently. And as of now, it looks like Sasikumar is busy working on some scripts that would suit the actor. If the Surya-Sasikumar project takes off, it is likely to be only in mid-2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X