»   » నిజం...మహేష్ టైటిల్ ...' ఆనందం ఆనందమే'

నిజం...మహేష్ టైటిల్ ...' ఆనందం ఆనందమే'

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మహేష్ బాబు చిత్రానికి ' ఆనందం ఆనందమే' అనే టైటిల్ ని ఖరారు చేసి విడుదల చేస్తున్నారు. అయితే ఇది తెలుగు సినిమాకు పెడుతున్న టైటిల్ కాదు..తమిళంలో విడుదల అవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం డబ్బింగ్ వెర్షన్ కి ఈ టైటిల్ ని ఖరారు చేసారు. జూలై నెల రెండో వారంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. మహేష్ మార్కెట్ ఎలా ఉన్నా..అక్కడ సమంత, ప్రకాష్ రాజ్, అంజలి సుపరిచితులు కావటం చిత్రానికి ప్లస్ అవతుందని భావిస్తున్నారు.

ఆప్యాయతల కోసం పరితపించిన ఇద్దరు అన్నదమ్ముల కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' .వెంకటేష్‌, మహేష్‌బాబు హీరోలుగా నటించారు. సమంత హీరోయిన్. ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అంజలి ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు.

SVSC Tamil version ready for release

దర్శకుడు మాట్లాడుతూ ''ఆత్మీయానురాగాలకు నెలవైన ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది. ప్రేమాభిమానాలకు సరితూగే సిరిసంపదలు లేనే లేవు. ఆస్తుల్ని మళ్లీ సంపాదించగలం.. కానీ అనుబంధాలను కాదు అనే మాట ఆ కుటుంబం నమ్ముతుంది. అదే మా సినిమాలో చూపెట్టాం '' అన్నారు.

మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే కోలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

English summary
Now the movie Seethamma Vaakitlo Sirimalle Chettu 's Tamil version titled 'Aanandam Aanandame' is all set to hit screens in Tamil Nadu in the month of July.
Please Wait while comments are loading...