»   » ఫొటో మాత్రమే నాది... ఇంటర్వ్యూ కాదు: తమన్నా ఫైర్

ఫొటో మాత్రమే నాది... ఇంటర్వ్యూ కాదు: తమన్నా ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై‌: ఫొటో మాత్రమే తనదని, ఇంటర్వూ మాత్రం తనది కాదని తమన్నా పైర్ అయ్యారు. తన పేరుతో ప్రచురించిన ఓ తమిళ ఇంటర్వూని ప్రస్దావిస్తూ ఆమె అసలు తను అలాంటి ఇంటర్వూ ఇవ్వలేదని, అందులో చెప్పిన అభిప్రాయాలు తనవి కాదని అన్నారు.

కుముదమ్ తమిళ వారపత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ తనది కాదని నటి తమన్నా వెల్లడించారు. ఒక తమిళ వారపత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూ తాను ఇవ్వలేదని ఇలాంటి ఫేక్‌ ఇంటర్వ్యూలపై వివరణలు ఇవ్వలేక విసుగొస్తోందని ఆమె తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు.

ఆ ఇంటర్వ్యూలో రాసిన విషయాల్లో చాలా వాటికి తన అభిప్రాయాలకి అసలు పొంతన లేదని, అందుకే అభిమానులు గందరగోళానికి గురికాకుండా తాను వివరణ ఇస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.

Tamanna Fire on Kumudam Magazine

ప్రస్తుతం నాగార్జున-కార్తీల సినిమా, రవితేజ 'బెంగాల్‌ టైగర్‌' చేస్తున్నా. మంచి సినిమాలు చేస్తూ పోవడమన్నదే నా అజెండా. అది ఏ భాషా సినిమా అని ప్రత్యేకించి చూడను. అని తెలిపారు.

English summary
Tamannaah Bhatia tweeted:"Kumudam magazine carries an interview of mine ,which I haven't given , tired of clarifying these fake interviews !! "
Please Wait while comments are loading...