»   » తమన్నా ..ఇది నిజమా... ?

తమన్నా ..ఇది నిజమా... ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమన్నా కి తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళంలో వెలిగిపోతోంది. అక్కడ ఆమె రెండు కోట్లు దాకా డిమాండ్ చేస్తోంది. కార్తీ నటించిన 'సిరుతై' తరువాత తమిళ సినిమాలకు కాస్త బ్రేకిచ్చేసింది తమన్నా. ఆ సినిమా తరువాత తమిళ చిత్రసీమవైపు చూడని ఈ ముద్దుగుమ్మ కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం అజిత్ హీరో గా నటిస్తున్న 'వీరమ్' చిత్రంలో నటిస్తోంది. తెలుగు సినిమాలకు కోటి ఇరవై లక్షలు తీసుకుంటున్న ఈ భామ అజిత్ సినిమా కోసం ఏకంగా రెండు కోట్లు పారితోషికం తీసుకుంటోందని చెన్నై చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

తెలుగులో నాగచైతన్య తో చేసిన 'తడాఖా' తరువాత కాస్త జోరు తగ్గించిన ఈ సుందరి హిందీలో మాత్రం స్పీడు పెంచేసింది. అయితే మహేష్ హీరోగా శ్రీనువైట్ల రూపొందించనున్న 'ఆగడు' చిత్రంతో మళ్లీ తన హవాను కొనసాగిస్తానంటోంది.

తమన్నా మాట్లాడుతూ 'అజిత్ అంటే నాకు చాలా ఇష్టం. అతనితో సినిమా అనే సరికి కాదన లేకపోయాను. అదీకాక తమిళంలో నేను సినిమా చేసి చాలా రోజులవుతోంది. అక్కడి అభిమానులను మరోసారి ఆకట్టుకోవాలన్న భావనతో 'వీరమ్' సినిమా చేస్తున్నాను' అని తెలిపింది. తమన్నా హిందీలో 'ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్' చిత్రంతో పాటు 'హమ్ శకల్' అనే పేరుతో రూపొందనున్న చిత్రంలోనూ నటిస్తోంది.

ఇక తమన్నా మాత్రం 'ప్రేమ' అనే విషయానికి మాత్రం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తమన్నా వ్యవహారం చూస్తుంటే....ముందు డబ్బు సంపాదించుకోవాలి, ఆ తర్వాతే ప్రేమాగీనా అనే విషయాల గురించి ఆలోచించాలి అన్నట్లు ఉంది. ఎప్పుడైనా? ఎవరితోనైనా ప్రేమలో పడ్డరా? అని మీడియా వారు ప్రశ్నిస్తే తనదైన రీతిలో వారికి కౌంటర్ ఇస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్నానని, ప్రేమించే సమయం కూడా లేదని అంటోంది ఈ మిల్కీ బ్యూటీ.

English summary
Tamanna who romanced with mega heroes Ramcharan and Pawan Kalyan in films like ‘Racha and Cameraman Gangatho Rambabu’ got whopping offer from Kollywood film makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu