»   » రంజిత రాసలీలపై తమన్నా స్పందన

రంజిత రాసలీలపై తమన్నా స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల సంచలనం సృష్టించిన రంజిత, నిత్యానంద స్వామి రాసలీలలపై తమన్నా తీవ్రంగానే స్పందించింది. ఆమె చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ...రంజిత తప్పు చేశారని మాలాంటి ఇతర హీరోయిన్లందరినీ అలాగే అనుకోకూడదు. అలాగే హీరయిన్స్ అందరినీ ఒకేలాచూడకూడదు. అయినా అందరు హీరోయిన్లు రంజితలా ఉంటారని ఎందుకు భావిస్తారు అంది కోపంగా. చివరగా ఇది అది రంజిత వ్యక్తిగత విషయం. దీనిపై అభిప్రాయం వ్యక్తం చేయలేనని తేల్చి చెప్పింది. ఇక రంజిత ఎఫైర్ తమిళ చిత్ర పిరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య భువనేశ్వరి వ్యభిచార వ్యవహారం ఇంకా తేలకముందే ఇది తెరమీదకు రావటంతో హీరోయిన్స్ అంటేనే చిన్నచూపు ఏర్పడుతోందని సీనియర్స్ వాపోతున్నారు. అలాగే మీడియా కూడా వీరిని రంజిత విషయంపై అభిప్రాయం అడగటం కూడా పద్దతి కాదంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu