సూపర్ హాట్: తమన్నా న్యూ ట్రైలర్ అదిరింది (వీడియో)
హైదరాబాద్: బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో నటించిన తమన్నా.... సౌత్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలోనూ హైలెట్ అయింది. ఆమె అవంతిక పాత్ర సూపర్ హాట్ సెక్సీగా ఉండటంతో పాటు, వివాదం చెలరేగడమే ఇందుకు కారణం. ఈ పరిణామాలతో తమన్నా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ఆ సంగతి పక్కన పెడితే తమన్నా నటించిన తమిళ చిత్రం ‘వాసువుమ్ సరవననుమ్ ఒన్న పడిచవంగా' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం రాజేష్ దర్శకత్వం వహించారు. ఆర్య, సంతానం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్లో తమన్నా లుక్ సూపర్ హాట్ గా ఆకట్టుకునే విధంగా ఉంది. ఆ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











