For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవును..నిజమే, తమన్నాకు 'పెళ్లి చూపులు' ఫిక్స్,పెళ్లి కొడుకు ఎవరంటే...

  By Srikanya
  |

  హైదరాబాద్: తమన్నా వంటి స్టార్ హీరోయిన్ కనపడగానే మీడియావాళ్ళు ఊరుకుంటారా..వెంటనే 'పెళ్లెప్పుడు?' అని అడుగుతుంటారు. ఈ ప్రశ్న తమన్నా చాలాసార్లు ఎదుర్కొన్నారు. 'జరిగినప్పుడు చెబుతానండి' అని సమాధానం ఇస్తూ దాటుకొచ్చిందీ బ్యూటీ. అయితే ఇప్పుడు పెళ్లిచూపులకు రెడీ అయ్యారు. కంగారుపడకండి... తమన్నా పెళ్లి చూపులేంటి..పెళ్లి చేసుకోవటానికి ఫిక్సైందా అని కంగారుపడి బెస్ట్ విషెష్ చెప్పేయకండి.

  ఆమె పెళ్లిచూపులుకు కూర్చుంటోంది కానీ నిజ జీవితంలో కాదు..పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో . అవును..తమన్నా..తమిళ పెళ్లి చూపులు రీమేక్ లో హీరోయిన్ గా చేయటానికి ఎంపికైందని తమిళ సినీ వర్గాల సమాచారం. విజయ్‌ దేవరకొండ, రితూ వర్మ నటించిన 'పెళ్లి చూపులు' తమిళ రీమేక్‌లో తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు.

  ఈ చిత్రం తమిళ హక్కులను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దక్కించుకున్నారు. నూతన హీరోతో ఈ రీమేక్‌ని తన సహాయ దర్శకుడు సెంథిల్‌ వీరాస్వామి దర్శకత్వంలో నిర్మించనున్నారు. తమన్నా స్టార్‌డమ్‌ ఈ చిత్రానికి వర్కవుట్‌ అవుతుందని గౌతమ్‌ మీనన్‌ పేర్కొన్నారు.

  మీడియాతో ఖరారు

  మీడియాతో ఖరారు

  తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ''పెళ్లి చూపులు '' మూవీ తెలుగులో భారీ విజయం సాధించడంతో ఇపుడు ఈ చిత్రాన్ని హిందీ, తమిళం ఇలా పలు బాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రీమేక్ వెర్షన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని దర్శకుడు సెందిల్ వీరాస్వామి మీడియాతో ఖరారు చేసారు.

  సెంధిల్ వీరాస్వామి మాట్లాడుతూ..

  సెంధిల్ వీరాస్వామి మాట్లాడుతూ..

  " అవును, మేము తమన్నాను ఈ రీమేక్ కు హీరోయిన్ గా ఎంపిక చేసాం, మేము మిగతా క్రూని ఎంపిక చేసే పనిలో ఉన్నాం." అన్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. అని చెప్పుకొచ్చారు.

  ప్రతి ఒక్కరకీ..

  ప్రతి ఒక్కరకీ..

  2016 సంవత్సరానికి గాను తెలుగులో నమోదైన హిట్ సినిమాల్లో ‘పెళ్లి చూపులు' ఒకటి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఓవర్సీస్ లో సైతం కళ్ళు చెదిరే కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాలో నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరికీ అద్భుతమైన అవకాశాలొస్తున్నాయి. ఇంట గొప్ప విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దృష్టి పడింది. ఆ సినిమాని తమిళంలోకి రీమేకే చేయాలని ఆయన సంకల్పించారు.ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు.

  ప్రేమమ్ హీరోని..

  ప్రేమమ్ హీరోని..

  తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ ఈ సినిమాలో హీరోగా మలయాళ హీరో నవీన్ పౌలీ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. నవీన్ పౌలీ ‘ప్రేమమ్' చిత్రంతో నేషన్ లెవల్లో పాపులర్ అయ్యాడు. అన్నింటినీ మించి మంచి ఈజ్ ఉన్న నటుడు కూడా. అందుకే పెళ్లి చూపులు లాంటి సున్నితమైన కథకు అతనైతేనే కరెక్టని గావుతం మీనన్ భావిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.

  హీరోకి పెళ్లి చూపులు

  హీరోకి పెళ్లి చూపులు

  ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)... లైఫ్‌ను జాలీగా లీడ్ చేస్తూ ఇంజనీరింగ్ అతికష్టం మీద సప్లిలు రాసి పాసైనఇప్పటి జనరేషన్ కుర్రాడు. ఎంబీఏ పూర్తి చేసి సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్న అమ్మాయి చిత్ర (రీతు వర్మ). పనీ పాట లేకుండా తిరిగే ప్రశాంత్‌‌కు పెళ్లి చేయాలని, అప్పుడైనా జీవితం మీద బాధ్యత వస్తుందని చిత్రతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు.

  హీరోకు నో చెప్పేస్తుంది

  హీరోకు నో చెప్పేస్తుంది

  సొంతగా వ్యాపారం చేస్తానంటే ఇంట్లో సపోర్టు లేకపోవడంతో పాటు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో... ఈ పెళ్లి చూపులకు సిద్ధమవుతుంది చిత్ర. కట్ చేస్తే పెళ్లి చూపుల్లో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పుడ్ ట్రక్ బిజినెస్ చేసి సొంతగా తన కాళ్ల మీద నిలబడాలనే ఆలోచన ఉందనే విషయం చెప్పి పెళ్లి నిరాకరిస్తుంది. దీంతో ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడతాడు.

  ఎలాంటి మార్పులు..

  ఎలాంటి మార్పులు..

  కానీ అక్కడ కూడా వర్కౌట్ కాక పోగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రశాంత్‌కు వంటలు చేయడం అంటే ఇష్టం. దీంతో చిత్రతో కలిసి ట్రక్ బిజినెస్‌లో జాయిన్ అవుతాడు. రెండు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న వీరి జీవితాల్లో పెళ్లి చూపులు తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత ఏమైంది? అనేది అసలు స్టోరీ...

  అంత రేటు పెట్టి..

  అంత రేటు పెట్టి..

  ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం మొదట్నుంచీ భారీ పోటీ ఏర్పడింది. రీసెంట్ గా తెలుగు ప్రముఖ చానళ్ళలలో ఒకటైన జెమినీ టీవీ ఈ హక్కులను సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం..సుమారు 2.35 కోట్ల రూపాయలు వెచ్చించి జెమినీ టీవీ, పెళ్ళిచూపులు సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

  సీన్స్ అన్నీ నా చుట్టే...

  సీన్స్ అన్నీ నా చుట్టే...

  ఈ సినిమా కు రాజమౌళి ఇచ్చి రివ్యూ బాగా కలిసి వచ్చింది. 'పెళ్ళిచూపులు' సినిమా చాలా బాగుందని, సినిమా అయిపోయాక కూడా సన్నివేశాలన్నీ చుట్టూ తిరుగుతున్నట్టే ఉన్నాయని మొదలుపెడుతూ రాజమౌళి సినిమాపై ప్రశంసలు కురిపించారు. రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా.. ఇలా ఇన్ని విషయాల్లో బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చిన ఈ సినిమా తనకు ఓ మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలకు ఇంకా ఎక్కువ థియేటర్లు దొరకాలని రాజమౌళి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

  పెద్ద కథ కాదు కానీ...

  పెద్ద కథ కాదు కానీ...

  బీటెక్‌ కంప్లీట్‌ చేసి, షెఫ్‌ కావాలనుకునే హీరో... ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలనుకునే హీరోయిన్‌... 'పెళ్లి చూపులు'కి ఓ ఇంటికి వెళ్లబోయిన హీరో ఆమె ఇంటికి వెళ్లడం... తర్వాత ప్రేమ, వగైరా వగైరా కథ ఇంతే. కానీ, అందులోని పాత్రలు, సందర్భాలతో ప్రేక్షకులు తమను తాము రిలేట్‌ చేసుకున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ సహజత్వానికి దగ్గరగా తీయడంతో ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూశారు. 'పెళ్లి చూపులు' తర్వాత హీరో విజయ్‌ దేవరకొండకి బడా బడా నిర్మాణ సంస్థల్లో నటించే ఛాన్సులు వచ్చాయి.

  ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూసేలా..

  పెళ్లి చూపులు సినిమాకు క్రేజ్ ..ట్రైలర్ తోనే వచ్చేసింది. ట్రైలర్ చూసిన వారంతా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసారు. ట్రైలర్ తోనే రికార్డ్ లు క్రియేట్ చేసిన ఘనత ఈ సినిమాది

  English summary
  Tamannaah Bhatia will star in the yet-untitled Tamil remake of recent Telugu indie hit “Pelli Choopulu“.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X