నటుడు, దర్శకుడు మణివన్నన్ మృతి

మణివన్నన్ కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగు, మళయాలం, హిందీ సినిమాల్లో కూడా నటించారు. మణివన్నన్ దర్శకత్వంలో చివరగా సత్యరాజ్ ప్రధాన పాత్రలో 'నాగరాజ చోలన్ ఎంఏ, ఎంఎల్ఏ' అనే తమిళ చిత్రం విడుదలైంది. మే 10, 2013లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ఓ పాత్ర కూడా పోషించారు.
తెలుగులో ఆయన ప్రేమలేఖ, శివాజీ, నరసింహ తదితర చిత్రాల్లో నటించారు. మణివన్నన్ మరణవార్తతో కోలీవుడ్ మొత్తం విషాదంలో మునిగి పోయింది. నటులు సిద్ధార్థ, ప్రియమణి, దర్శకుడు సుందర్ సి తదితరులు ట్విట్టర్లో తమ సంతాపం వ్యక్తం చేసారు. మణివన్నన్ మరణ వార్త ఇటు పలువురు తెలుగు సినీ ప్రముఖులను కూడా కలిచి వేసింది.


Click it and Unblock the Notifications











