టెలివిజన్ నటుడు దారుణంగా నరికివేత.. నడిరోడ్డుపైకి లాగి కత్తులతో దాడి

తమిళ చిత్ర పరిశ్రమలో దారుణమైన సంఘటన జరిగింది. టెలివిజన్ నటుడు సెల్వారాతినమ్ అనే నటుడిని దారుణంగా గుర్తు తెలియని వ్యక్తుల నరికి చంపారు. అయితే సెల్వారాతినమ్ హత్యపై అనేక ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

విజయ్ టెలివిజన్‌లో

విజయ్ టెలివిజన్‌లో

సెల్వారాతినమ్ శ్రీలంకకు చెందిన తమిళుడు. నటనపై ఆసక్తితో చెన్నైకి చేరుకొని టెలివిజన్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ నటించాడు. ప్రస్తుతం విజయ్ టెలివిజన్‌లో ప్రసారం అవుతున్న తథెనిమోజీ అనే సీరియల్‌లో నటించాడు. సెల్వారాతినమ్ ‌వివాహితుడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో

రియల్ ఎస్టేట్ రంగంలో

సెల్వారాతినమ్ నటనతో పలు వ్యాపారాల్లో భాగస్వామ్యం అయ్యాడు. గత కొద్దికాలంగా బిల్డింగ్ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో బిజిగా ఉన్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యవహారాలో వ్యక్తిగత విభేదాలు కక్షలే ఆయన హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

నలుగురు ఆటోలో వచ్చి

నలుగురు ఆటోలో వచ్చి

సెల్వారాతినమ్ హత్యపై పోలీసులు వెల్లడించిన ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌‌లోని ఆయన నివాసానికి ఆయుధం ధరించిన నలుగురు ఆటోలో వచ్చి ఆయనపై ఎటాక్ చేశారు. బయటకు తీసుకు వచ్చి కత్తులు, సికెల్స్ దాడి చేశారు. అతడిని దారుణంగా నరకడంతో అక్కక్కడికే ప్రాణాలు వదిలాడు అని తెలిపారు.

సీసీటీవీలు ధ్వంసం చేసి.. హత్య

సీసీటీవీలు ధ్వంసం చేసి.. హత్య

సెల్వారాతినమ్ దాడి చేసే సమయంలో ఆధారాలు లభ్యం కాకుండా ఇరుగు పొరుగు నివాసాల్లో ఉండే సీసీటీవీ కెమెరాలను అగంతకులు ధ్వంసం చేశారు. అయితే ఈ హత్యకు పాల్పడిందెవరనే విషయంపై పోలీసులు రంగంలోకి కూపీ లాగుతున్నారు. ఎవరితోనైనా కక్షలు ఉన్నాయా అని సెల్వారాతినమ్ కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X