»   » డిస్ట్రిబ్యూటర్ పై నటి మంజుల కుమార్తె ఛీటింగ్ కేసు

డిస్ట్రిబ్యూటర్ పై నటి మంజుల కుమార్తె ఛీటింగ్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినీ పంపిణీదారుడిపై నటి, నిర్మాత వనిత మంగళవారం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయటం ఇప్పుడు తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నటి వనిత మరెవరో కాదు... సీనియర్ నటుడు విజయకుమార్, ఒకప్పటి హీరోయిన్ మంజుల కుమార్తె. తను నిర్మించిన చిత్రం పంపిణీ విషయమై తన వద్ద నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసారని ఆమె ఆలరోపించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వనిత మీడియాతో మాట్లాడుతూ.... తాను వనిత ఫిలిం ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఎంజీఆర్, శివాజి, రజనీ, కమల్ నర్పణి మండ్రం అనే చిత్రాన్ని నిర్మించానన్నారు. ఈ చిత్ర పంపిణీ హక్కులను వెబ్రన్ మూవీస్ వెంకటేష్ రాజాకు ఇచ్చానని తెలిపారు. ఆయన తన చిత్రాన్ని 80 థియేటర్లలో విడుదల చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.

Tamil actor Vanitha Vijayakumar files complaint against film distributor

అలాగే చిత్ర ప్రచార ఖర్చు కంటూ 30 లక్షలను డిజిటల్ విధానంలో విడుదల చేయడానికంటూ ఎనిమిది లక్షలను తన నుంచి వెంకటేష్ రాజా తీసుకున్నారని చెప్పారు. చిత్రాన్ని అతి తక్కువ థియేటర్లలో విడుదల చేసి ఆయన ఒప్పందాన్ని మీరారని ఆరోపించారు.

దీంతో నిర్మాతగా తనకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అందువలన పంపిణీదారుడు వెంకటేష్‌రాజాను తాను ఇచ్చిన 38 లక్షలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఆయనపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు నటి, నిర్మాత వనిత వెల్లడించారు.

English summary
Tamil actor Vanitha Vijayakumar lodged a cheating complaint against a film distributor at the Chennai city police commissioner's office on Tuesday. Vanitha, daughter of actors Vijayakumar and Manjula, told reporters that her production company - Vanitha Film Production -- had recently produced a movie, titled "MGR, Sivaji, Rajini, Kamal.
Please Wait while comments are loading...