»   » పెళ్లిపేరుతో మోసం ...సినీనటి పోలీస్ కంప్లైంట్

పెళ్లిపేరుతో మోసం ...సినీనటి పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఆండిపట్టికి చెందిన ఇళయరాజా అనే వ్యక్తి తనను వివాహం చేసుకొని, కొంతకాలం తరువాత మోసగించాడని సినీ, బుల్లితెర నటి హేమలత ఫిర్యాదు చేసింది. గతంలో 'పుల్లుకట్టు ముత్తమ్మ' అనే తమిళ చిత్రంతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించిన హేమలత ప్రస్తుతం సినిమా నిర్మాణ సంస్థ నడుపుతోంది. ఆండిపట్టికి చెందిన రాజకీయవేత్త రాజ రెండో కుమారుడు ఇళయరాజ -హేమలతలకు కొంతకాలం క్రితం వివాహం జరిగింది.

అయితే, ప్రస్తుతం తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇళయరాజ మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. ఈ మేరకు నిశ్చితార్థం కూడా జరిగింది. దీనిపై హేమలత తనకు న్యాయం చేయాల ని కోరుతూ తిరుమంగళం పోలీసులకు, నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసింది.

Tamil actress Hemalatha meets Chennai police

కాగా తెలుగు వ్యక్తి కావడం, స్థానికంగా పలుకుబడి లేకపోవడంతో తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, మిత్రుల సలహా మేరకు తెలుగువారికి అండదండలు అందిస్తున్న ద్రవిడదేశం అధ్యక్షుడు కృష్ణారావుకు ఫిర్యాదు చేశానని హేమలత తెలిపింది. కాగా, పలువురు మహిళలు ఇలా నయవంచకుల చేత మోసగింపబడుతున్నారని, వీరు మౌనంగా ఉండిపోవడం కంటే న్యాయం కోసం పోరాడవలసి ఉందని కృష్ణారావు అన్నా రు. తెలుగువారైన హేమలతకు న్యాయం జరిగే వరకు ద్రవిడదేశం అన్ని విధాలుగా ఆండగా నిలుస్తుందని ప్రకటించారు.

English summary
Actress Hemalatha has given a complaint against actor Ilayaraja for cheating her in the name of marriage. Hemalatha met Chennai city police commissioner T K Rajendran seeking legal action against Ilayarajah, who had allegedly cheated her by promising to marry her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu