»   » రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళనాడులోని పెరంబలూరు వద్ద కంటైనర్ లారీ పక్కన వస్తున్న కారుపై పడడంతో సినిమా డెరైక్టర్ తో సహా ముగ్గురు మృతి చెందారు.సినిమా డెరైక్టర్ అయిన కన్నా (42) నెజంతొట్టు సొల్లు చిత్రానికి దర్శకత్వం చేస్తున్నాడు. ఇతను తన మిత్రుడు విరుగంబాక్కంకు చెందిన విజయకుమార్ (50)తో కలిసి రామనాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకుని తిరిగి శుక్రవారం రాత్రి చెన్నైకి కారులో బయలుదేరారు. కన్నాది చెన్నై విరుగంబాక్కం కావటంతో అతని పరిచయస్దులంతా భాధతో సంఘటనా స్దలానికి చేరుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే...

Tamil director Dies in Road Accident

కారును సురేష్ అనే యువకుడు నడుపుతున్నాడు. పెరంబలూరు తిరుమంతురై టోల్‌గేట్ వద్ద కారు వస్తుండగా ఆ సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ లారీ టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న సినీ డైరక్టర్ తో సహా ముగ్గురు మృతి చెందారు.

దీనిపై ఫిర్యాదు అందుకున్న మంగళమేడు పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ కడలూరుకు చెందిన కార్తికేయన్‌ను అరెస్టు చేశారు.

English summary
Tamil director Kanna , died in a road accident after his Car collided with a lorry on 24,Many . He was 42.
Please Wait while comments are loading...