»   » మూడు పాత్రల "మెర్సల్", సినిమా కోసం హీరో "మ్యాజిక్" శిక్షణ: తెలుగులో కూడా దీపావళికే రిలీజ్

మూడు పాత్రల "మెర్సల్", సినిమా కోసం హీరో "మ్యాజిక్" శిక్షణ: తెలుగులో కూడా దీపావళికే రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా హీరో అంటే ఒకప్పుడు కేవలం నటించటం వస్తేచాలు, యాక్షన్ సన్నివేశాలకీ, లేదంటే ఇంకేదైనా కళాకారుడు గా హీరో ఉన్నప్పుడు అతను చేసే ఖళా ఖండాల పని చేయటానికీ స్టంట్ మ్యాన్లూ, కళాకారుళూ ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నా. తమ పాత్రలని మాత్రం సింపుల్ గా తీసుకోవటం లేదు హీరోలు. కత్తి యుద్దాలు నేర్చుకుని కండలు పెంచటం, గుర్రపు స్వారీలూ, సైనిక శిక్షణలూ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు తెలుగులో రాబోతున్న "అదిరింది" (తమిళం లో మెర్సల్) సినిమా కోసం విజయ్ కూడా శిక్షన తీసుకున్నాడట. అయితే యుద్దవిద్యల్లోనో, డాన్సుల్లోనో కాదు ఇంతకీ ఆశిక్షణ దేనికోసమో తెలుసా?? మ్యాజిక్ షో చేయటం లోనట.

 అదిరింది

అదిరింది

"అదిరింది" సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట. అందులో ఒకటి మెజీషియన్ పాత్ర. ఈ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ నిజంగానే మేజిక్ లో కొన్ని ట్రిక్కులు నేర్చుకున్నాడు. పేరున్న మెజీషియన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా గొప్ప మెజీషియన్లుగా పేరు తెచ్చుకున్న వారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు.


పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన శరత్ మరార్

పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన శరత్ మరార్

తాను నేర్చుకున్న ట్రిక్కులతో షూటింగ్ టైంలో యూనిట్ మొత్తాన్ని బాగానే మెప్పించాడట. అదిరింది సినిమాను పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన శరత్ మరార్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మూల కథ అందించింది బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం.


 తెలుగులో మార్కెట్ కోసం

తెలుగులో మార్కెట్ కోసం

తెలుగు నేలపై ఇమేజ్ సంపాదించుకోవాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. సినిమాలు యావరేజ్ గా కలెక్షన్లు రాబడుతున్నాయే తప్ప ప్రేక్షకుల్లో పాపులారిటీ మాత్రం రాలేదు. ఒకటి రెండు సినిమాలు బాగా ఆడి మంచి కలెక్షన్లు సంపాదించినా అదంతా డైరెక్టర్ అకౌంట్లో క్రెడిట్ అవుతోంది తప్ప విజయ్ కు ఒరిగిందేం ఉండటం లేదు.


కాజల్ అగర్వాల్, సమంత

కాజల్ అగర్వాల్, సమంత

అదిరింది అయినా అతడి ఆశలు నిలబెడుతుందేమో చూద్దాం. తమిళంతోపాటే తెలుగులోనూ ఈ మూవీ దీపావళికి ముందు థియేటర్లకు రానుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్ - సమంత ఇందులో హీరోయిన్లుగా నటించారు. మరి ఈసారైనా విజయ్ కష్టానికి తెలుగులో ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.


English summary
While Vijay playing a triple role is an exciting prospect on its own for his fans, the first look posters of Mersal revealed that one of those roles would be that of a magician.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu