»   »  'బాహుబలి' కు కౌంటర్ ఇవ్వాలనే స్టార్ హీరో ఇలా?

'బాహుబలి' కు కౌంటర్ ఇవ్వాలనే స్టార్ హీరో ఇలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'బాహుబలి' గురించి విశేషాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఓ తమిళ హీరో ఈ చిత్రానికి కౌంటర్ ఇవ్వటానికి సిద్దపడుతున్నాడు అంటున్నారు. అతను మరెవరో కాదు..విజయ్. తన తాజా చిత్రం'పులి' తో ఆయన 'బాహుబలి' కు సమాధానం చెప్తాడంటున్నారు. 'పులి' చిత్రంలో శ్రీదేవి, సుదీప్, శృతిహాసన్, హన్సిక ఉండటంతో మరింతగా హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసినవారంతా అలాగే ఫీవుతున్నారు. తమిళ మీడియా సైతం అలాగే అభివర్ణిస్తోంది. అయితే కొంతమంది మాత్రం ఎక్కడ బాహుబలి...ఎక్కడ పులి...ఈ రెండింటికి పోటీనా అని పెదవి విరుస్తున్నారు. మీరు ఇప్పటికే పులి ట్రైలర్ చూసి ఉంటారు. లేక పోతే ఇక్కడ చూసి డిసైడ్ చేయండి.తమిళ నటుడు విజయ్‌ నటించిన 'పులి' చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పోస్టర్‌లో విజయ్‌ మధ్యయుగానికి చెందిన వీరుడిలా కనిపిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ నేడు విడుదల చెయ్యనున్నారు.చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ,టీజర్ ని విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.


 Tamil Hero Vijay's Answer To Baahubali

చింబుదేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇది కాకుండా విజయ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ జిల్లా తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.


ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది.


ప్రముఖ నటి శ్రీదేవి దక్షిణాదిన పునరాగమనం చేస్తున్న చిత్రర 'పులి'. చింబు దేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.


 Tamil Hero Vijay's Answer To Baahubali

షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
At the time when whole of India is talking about movies like Baahubali and Rudramadevi, here comes Ilayathapalathy Vijay's "Puli".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu