రామ్ చరణ్ వద్దనుకున్న టైటిల్ తో హీరో విజయ్
చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్‌లో ట్రెండ్‌గా మారిన చిత్రం ఏదీ అంటే ... 'తెరి' . 'పులి' తర్వాత విజయ్ హీరోగా ఇందులో నటిస్తున్నారు. 'రాజారాణి' ఫేం అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు గానూ మెరుపు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మెరుపు టైటిల్ ని గతంలో రామ్ చరణ్, తమిళ దర్శకుడు ధరణి కాంబినేషన్ లో ప్రారంభమై ఆగిపోయిన చిత్రానిది కావటం విశేషం.

చిత్రం మరిన్ని విశేషాలకు వస్తే...నిజానికి ఈ సినిమాకు 'తెరి' టైటిల్ పెట్టనున్నట్లు ఆరంభమైన రోజుల్లోనే సోషల్ మీడియాలో పోస్ట్‌లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ మళ్లీ పోలీసు అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అట్లీ విడుదల చేశారు. మూడు గెటప్‌లలో కనిపించే విజయ్ ఫొటోలు ఉన్నాయి.

గతంలో ఎప్పుడూ విజయ్ ఇలాంటి ఛాయల్లో కనిపించలేదని ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో త్రిపాత్రాభినయం పోషిస్తున్నారనేందుకు ఈ పోస్టరే సాక్ష్యమని కూడా ప్రచారం సాగుతోంది. విజయ్ సరసన సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











