twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ షోల్ పాల్గొన్నందుకు కమల్ హాసన్ కు నోటీసులు.. బాధ్యత లేదా అంటూ..

    |

    భారత దేశం గర్వించ దగిన హీరో, విలక్షణ నటుడు కమలహాసన్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలతో కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇటీవల తమిళనాడు ప్రభుత్వం తో పాటు ఆరోగ్య శాఖ కూడా సీరియస్ గా నోటీసులు అందజేసిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కనీస బాధ్యత లేకుండా వ్యవహరించలేదు అంటూ ఆరోగ్య శాఖ ఈ విషయంపై కమల్ హాసన్ కు నోటీసులు పంపించడంతో మీడియాలో కూడా వైరల్ గా మారింది.

    అమెరికా నుంచి రాగానే..

    అమెరికా నుంచి రాగానే..

    రాజకీయ పార్టీ అధినేతగా మంచి నటుడిగా ఎంతగానో గుర్తింపు అందుకున్న కమల్‌హాసన్ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా ప్రభుత్వ అధికారులు నోటీసులు అందించారు. గత నెలలో అమెరికా ప్రయాణాన్ని ముగించుకుని ఇండియాకు రాగానే కమల్ కొంత అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన వచ్చినప్పుడు జ్వరంతో ఉండడంతో వెంటనే హాస్పిటల్ లో చేరాడు. ఇక చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో గత నెల 22న కమల్‌హాసన్ చికిత్స కోసం అనుమతించారు.

    కరోనా పాజిటివ్

    కరోనా పాజిటివ్

    హాస్పిటల్ లో నిర్వహించిన పరీక్షలో కమల్‌హాసన్‌కు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఇక ఆయనకు రెండు వారాల పాటు వైద్యులు అత్యంత జాగ్రత్తగా ఒంటరిగా చికిత్స అందించారు. అయితే గత 2 రోజులకు ముందు డిశ్చార్జ్ అయిన కమల్ హాసన్ మరో రెండు రోజులు ఒంటరిగా క్వారంటైన్ లోనే ఉంటే మంచిది అని సూచించారు.

    ఆరోగ్యశాఖ సీరియస్

    ఆరోగ్యశాఖ సీరియస్

    అయితే కమల్ హాసన్ నిబంధాలను పట్టించుకోకుండా హాస్పిటల్ నుంచి రాగానే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు. రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా మళ్ళీ హోస్ట్ గా కనిపించారు. అయితే ఈ విషయంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ కమల్ హాసన్ కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఆసుపత్రిలో ఒంటరిగా ఉంచబడినప్పటికీ, దాని తర్వాత 7 రోజులు ఇంటిదగ్గర ఉండాలి.

    కమల్ హాసన్ కు నోటీసులు

    కమల్ హాసన్ కు నోటీసులు

    కానీ నిబంధనలను ఏ మాత్రం లెక్క చేయకుండా కమల్ హాసన్ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం కరెక్ట్ కాదని అందుకు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. కమల్ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి నేరుగా బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న ఈవీపీ ఎరీనాకు వెళ్లి చిత్రీకరణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, కరోనా నిబంధనలను ఉల్లంఘించడంతో ఘటనపై తమిళనాడు వైద్య శాఖను వివరణ కోరుతూ కమల్‌కు నోటీసు పంపనున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Priyanka Singh Emotional | Final Nominations || Filmibeat Telugu
    కమల్ స్థానంలో రమ్యకృష్ణ

    కమల్ స్థానంలో రమ్యకృష్ణ

    ఇక కమల్ హాసన్ అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన స్థానంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తమిళ్ బిగ్ బాస్ షో రేటింగ్ కూడా ఇటీవల చాలా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ రెండు వారాలు మిస్ అవ్వడంతో షో ఏ మాత్రం ఇంట్రెస్ట్ గా లేదనే కామెంట్స్ కూడా వచ్చాయి.

    English summary
    Tamil Nadu government given notices to Kamal Haasan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X