For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయ్‌‌పై కక్ష కట్టిన తమిళ సర్కార్.. మా హీరో అంటే అంత భయమా?.. ఫ్యాన్స్ ఫైర్

By Bhavani
|

సినిమాలు రాజకీయాలు వేరైనా.. వాటి మధ్య విడదీయలేని అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందరో సినిమా ప్రముఖులు రాజకీయాల్లో విజయ పతకాలను ఎగురవేశారు. అయితే అది అందరికీ సాధ్యపడలేదు. సినిమా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఉద్దండులు రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. అయితే రాజకీయాలు మాత్రం సినిమాలకు, కథానాయకులకు అప్పడప్పడు అడ్డుకట్ట వేస్తుంటాయి. ఈ ధోరణి మాత్రం తమిళ నాట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

తమిళ నాట రాజకీయాన్ని ఏలిన సినీ ప్రముఖులు..

తమిళ నాట రాజకీయాన్ని ఏలిన సినీ ప్రముఖులు..

తమిళ నాడులో సినిమాలు, రాజకీయాలు ఎంతగా పెనవేసుకున్నవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంజీర్ నుంచి కరుణానిధి, శివాజీ గణేషన్, జయలలిత, స్టాలిన్ ఇలా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు. అయితే శివాజీ గణేషన్కు మాత్రం రాజకీయాల్లో చేదు అనుభవమే మిగిలింది. ఎంజీర్, కరుణానిధి, జయలలిత మాత్రం.. రాజకీయ గతిని మార్చేశారు. అందుకే తమిళ నాట ఈ రెండు రంగాలను వేర్వేరుగా చూడరు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి సినిమాలను అడ్డుకోవడం..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి సినిమాలను అడ్డుకోవడం..

తమిళ నాడులో ఏ ప్రభుత్వం ఉన్నా.. తమకు వ్యతిరేకంగా వచ్చే సినిమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే అక్కడి అభిమానుల ఆగ్రహానికి తలొగ్గి.. ఆంక్షలను కూడా ఎత్తేసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తమిళనాట ఇళయ దళపతి విజయ్ హవా నడుస్తోంది. విజయ్ నటించిన ప్రతీ సినిమా వంద కోట్లను ఈజీగా కలెక్ట్ చేస్తోంది. తేరీ, మెర్సల్, సర్కార్ సినిమాలు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపాయి.

 విజయ్ సినిమాలకు ఎన్నో అడ్డంకులు....

విజయ్ సినిమాలకు ఎన్నో అడ్డంకులు....

జీఎస్టీని వ్యతిరేకించే సినిమా అంటూ మెర్సల్.. సర్కార్ చిత్రంలో తమ ఆరాధ్య దైవం తాలుకూ పోలికలతో పాత్రను రూపొందించారంటూ సర్కార్ చిత్రంపై కక్ష గట్టారు. ఇలా విజయ్ సినిమాలకు ఆటంకాలను ఏర్పర్చటం వెనక కారణాలున్నాయని అతని అభిమానులు వాదిస్తుంటారు. రాజకీయంగా వారికి ఎదురు నిలబడతాడనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

తాజాగా బిగిల్ చిత్రంపైనా కక్ష సాదింపు చర్యలు..

తాజాగా బిగిల్ చిత్రంపైనా కక్ష సాదింపు చర్యలు..

తేరీ, మెర్సల్ లాంటి బంపర్ హిట్ చిత్రాల తరువాత.. అట్లీ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న చిత్రం బిగిల్(విజిల్). తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రంలో విజయ్ ఫుల్ బాల్ కోచ్ గా నటిస్తున్నారు. విజయ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన తరువాత.. అది ఓ రేంజ్లో వైరల్ అయింది.

పర్మిషన్ ఇచ్చిన కాలేజ్ కు నోటీసులు...

పర్మిషన్ ఇచ్చిన కాలేజ్ కు నోటీసులు...

ఆడియో ఫంక్షన్ చేసేందుకు సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ను చిత్రయూనిట్ సంప్రదించగా.. యాజమాన్యం ఒప్పుకొంది. గత గురువారం ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తమ పర్మిషన్ లేకుండా ఎలా ఆడియో ఫంక్షన్ను నిర్వహిస్తారని.. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ సదరు కాలేజ్ కు ఓ నోటీసును పంపించిందట.

ఫైర్ అవుతున్న ఫ్యాన్స్...

ఫైర్ అవుతున్న ఫ్యాన్స్...

ఇక దీనిపై విజయ్ అభిమానులు భగ్గుమంటున్నారు. సర్కార్ ఆడియో ఫంక్షన్ కూడా అక్కడే జరిగింది.. అప్పుడు ఎందుకు అడగలేదంటూ కొందరు ఫైర్ అవుతుండగా.. విజయ్ సినిమాలకే ఎందుకిలా చేస్తారు.. విజయ్ అంటే అంత భయమా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అభిమానుల ముందుకు రానుంది.

English summary
TN Govt Sents Notice To Sairam Engenering College, Which Is Given Permission To Vijay Bigil Movie Audio Function. Now Vijay Fans Fires On Tamilnadu Government. Bigil Movie Directed By Atlee.. Nayanatara Is Female Lead And Music Composed By AR Rahman.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more