»   » ఓటేసిన కమల్,రజనీ,మిగతా స్టార్స్(ఫొటోలు)

ఓటేసిన కమల్,రజనీ,మిగతా స్టార్స్(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరోదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎలక్షన్స్ లో సామాన్యులతో పాటు సినిమావారు పాల్గొని తమ అభిమానులకు స్పూర్తి ని ఇస్తున్నారు.

ముఖ్యంగా తమిళనాడు నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలు వచ్చి సామాన్య జనాలతో పాటు ఓటు వేయటంతో వారి అభిమానులు సైతం ఎలక్షన్స్ లో ఉత్సాహంగా ఓటేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఓ రకంగా ఓటు హక్కుని తప్పని సరిగా వినియోగించుకోవాలనే విషయం వీరు ప్రమోట్ చేస్తున్నారు. అందుకే వారు ఎలక్షన్ అనంతరం తాము ఓటు హక్కుని వినియోగించుకున్నామని,మీరూ వినియోగించుకోమన్నట్లు తమ వేలుని చూపుతూ స్టిల్స్ ఇచ్చారు.

స్టార్స్,ఓట్స్ స్లైడ్ షోలో గమనించండి...

రజనీకాంత్...

రజనీకాంత్...

ఈ సూపర్ స్టార్ ఎప్పుడూ క్రమం తప్పకుండా తన ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు. ఆయన అభిమానులు సైతం కొన్ని ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రచారంచేసారు.

కమల్ హాసన్

కమల్ హాసన్


తానెంత పెద్ద స్టారైన కమల్ హాసన్ తనకు దేశభక్తి,దేశం కోసం చెయ్యాల్సిన కొన్ని విధులను ఎప్పుడూ మరవరు. అందులో భాగంగానే ఓటు హక్కుని వినియోగించుకుని ఇలా అభిమానులకు సందేశం ఇచ్చారు.

గౌతమిని

గౌతమిని

కమల్ తనతోపాటు సహజీవనం చేస్తున్న గౌతమిని సైతం తీసుకువచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి రావటంతో మీడియా కాన్సర్టేషన్ మొత్తం వీరిపైనే ఉంది.

సూపర్ స్టార్ అయినా

సూపర్ స్టార్ అయినా

రజనీకాంత్ వస్తున్నారంటే ఆయన్ని చూడటానికి జనం ఎగబడతారు. అయినా ఆయన తాను సామాన్యుడుగా ఓటు హక్కుని వినియోగించుకుంటాను అని ఇలా బూతుకు వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు.

విజయ్

విజయ్


తమిళనాట రజనీతర్వాత చెప్పుకోదగ్గ స్టార్ హీరో విజయ్. ఈ ఇళయదళపతి ఓటింగ్ కు ఇలా వచ్చి ఓటు వేసి, అందురూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

విజయ్ హవా

విజయ్ హవా


విజయ్ ఓటింగ్ వస్తున్నాడనగానే అంతటా ఆయన అభిమానులు రావటం మొదలైంది. అయితే దాన్ని సమస్యగా కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుని ఓటింగ్ ని ముగించారు.

కుష్బూ

కుష్బూ


ఎలక్షన్ ప్రచారంలో సైతం పాల్గొ ని ఉపన్యాసాలు ఇచ్చిన కుష్బూ తను ప్రచారం చేసిన పార్టికి ఓటేయటానికి ఇలా వచ్చింది.

సెంధిల్

సెంధిల్


హాస్య నటుడు సెంధిల్ సైతం ప్రతీ ఎలక్షన్ లోనూ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న సెలబ్రేటీల్లో ఒకరు. ఆయన ఈ సారి కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు.

ప్రసన్న

ప్రసన్న


స్నేహ భర్త, హీరో అయిన ప్రసన్న ఓటేసి ..పౌరుడుగా తనవంతు బాధ్యత నెరవేర్చుకున్నారు.

అజిత్

అజిత్


తమిళ స్టార్ హీరో అజిత్ తన భార్య షాలినీతో కలిసి చెన్నైలో వెళ్లి ఓటేసారు. మిగతా ఓటర్లతో పాటే ఆయన లైన్ లో నిలబడి ఓటేయటం చాలా మందిని ఆకర్షించింది. అలాగే ఆయన అభిమానులకు ఓ సందేశం పంపినట్లేంది.

విజయకాంత్

విజయకాంత్


పార్టీ అధినేత,యాక్షన్ హీరో అయిన విజయ్ కాంత్ నిన్నటిదాకా పార్టీ ప్రచారాలతో హోరెత్తించి,ఇప్పుడు ఇలా ఓటేయటానికి వచ్చారు.

జీవా

జీవా


యంగ్ హీరో జీవా సైతం ఇలా తను ఓటేసాను అంటూ స్టిల్ ఇచ్చి, అందరూ ఓటేసి,ఓటింగ్ శాతం పెంచాలని,ఓట్ వేయటం మన భాధ్యత అని చెప్పారు.

English summary

 
 Tamil superstars Rajinikanth and Kamal Haasan cast their ballot here on Thursday. Other actors who also voted include Ajith Kumar, Jiiva, Khushbu Sundar, Prasanna Venkatesan and Senthil. Actor-filmmaker Kamal Haasan voted along with his live-in partner Gauthami, while Rajinikanth preferred to go alone. Actor Ajith Kumar was accompanied by his wife Shalini and his parents.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu