For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సింగం-3’నిర్మాతకి టోరెంట్ సైట్ షాక్: రిలీజ్ రోజే ఫేస్ బుక్ లైవ్ ఇస్తామంటూ ప్రకటన

  By Srikanya
  |

  చెన్నై: పైరసీ అనేది పెద్ద సినిమాలకు ఓ శాపంలా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎన్ని చర్యలు తీసుకున్నా పైరసీ ఆగటం లేదు. దాంతో కలెక్షన్స్ పరంగా చాలా నష్టం జరిగిపోతోంది. దాంతో పెద్ద సినిమా నిర్మాతలు...తమ సినిమా రిలీజ్ సమయంలో టోరెంట్ సైట్లపై కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు సూర్య లేటెస్ట్ సెన్సేషన్ సింగం 3 కు కూడా అదే సమస్య వచ్చింది.

  ఈ నెల 9న విడుదలవుతున్న సూర్య సినిమా 'ఎస్-3' పైరసీ వెర్షన్ గురించి ఓ తమిళ పైరసీ వెబ్ సైట్ ముందే అనౌన్స్ మెంట్ ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఆ రోజు ఉద‌యం 11 గంటల నుంచి ఈ మూవీని త‌మ సైట్ లో చూడ‌వ‌చ్చు అంటూ ఏకంగా ఒక పైర‌శీ వెబ్ సైట్ తమిళ రాకర్స్ ప్ర‌క‌ట‌న విడ‌ద‌ల చేసింది. దీనిపై 'ఎస్-3' నిర్మాత జ్నానవేల్ రాజా మండి పడ్డాడు.

  సింగం 3 కు ప్రమోషన్ కు చెందిన ఓ పబ్లిక్ పంక్షన్ లో ...నిర్మాత జ్నానవేల్ రాజా ఈ సైట్ కు వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. తమ సినిమా ని కనుక పైరసీ చేస్తే ఆరు నెలలు లోగా మొత్తం ఆ సైట్ కు చెందిన వారందరినీ జైలులో పెట్టిస్తా అన్నారు. దాంతో రెచ్చిపోయిన తమిళ రాకర్స్ పైరసీ బ్యాచ్ ...సోషల్ మీడియాలో ..సింగం 3 ని రిలీజ్ రోజే ఫేస్ బుక్ ద్వారా లైవ్ స్టీమ్ ఇస్తామని పోస్ట్ చేసింది.

  Tamil Rockers piracy team threatened Singam 3 makers.

  దాంతో ఈ వెబ్ సైట్ కు వ్యతిరేకంగా అతను మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 'ఎస్-3' సినిమా పైరసీ వెర్షన్ పెట్టే వెబ్ సైట్లను నిషేధించాలని జ్నానవేల్ ఆ పిటిషన్లో కోరగా.. ఈ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీక‌రించ‌లేదు.. దీంతో ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో సింగం 3 చిత్ర యూనిట్ ప‌డింది.

  వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "S3-య‌ముడు-3". ఇందులో శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్ర‌వ‌రి 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలో 'య‌ముడు', 'సింగం' చిత్రాలను మించి ప్రీరిలీజ్‌కే రూ.100 కోట్ల వ్యాపారం చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

  ఈ చిత్రం స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఈ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌లై సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంసలు పొందుతుంది.

  ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ... త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌తో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం "S3-య‌ముడు-3". య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం "S3-య‌ముడు-3" ఇప్ప‌టికే రూ.100 కోట్ల బిజినెస్ చేసి రికార్డు సాదించింది.

  ఓకే క‌థ‌, క‌థ‌నం, ఓకే ద‌ర్శ‌కుడు, ఓకే హీరో, ఓకే హీరోతో ఇలా మూడు పార్టులు రావ‌టం ఇదే మెట్ట‌మెద‌టిసారి. అయితే అన్ని చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌టం ఇదే మెట్ట‌మెద‌టి సారి. అలాగే ఈ చిత్రంలో చాలా మాస్ ఆడియ‌న్స్‌ని న‌చ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. దర్శకుడు హ‌రి ఈ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే‌తో థ్రిల్‌ని క‌లిగించే స‌న్నివేశాల‌తో చిత్రం కొన‌సాగుతుంది. తెలుగు ప్రేక్ష‌కుల్లో హ‌రి స్క్రీన్‌ప్లే‌కి కూడా ఫ్యాన్స్ ఉండ‌టం విశేషం.

  English summary
  The producer of Singam 3 had told in a public function related to this movie’s promotion that if Tamil Rockers try to upload or stream this movie online, within 6 months they all will be in jail. As a reaction to that, Tamil Rockers team posted a threat through the social media platform that this time they will stream the movie through Facebook live on the very first day of its release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X