»   » లీగల్ సమస్యల్లో ‘అన్న’...విడుదల డౌటే?

లీగల్ సమస్యల్లో ‘అన్న’...విడుదల డౌటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ హీరో విజయ్ నటిస్తున్న 'తలైవా'(తెలుగులో 'అన్న') చిత్రం లీగల్ సమస్యల్లో ఇరుక్కుంది. రేపు(ఆగస్టు 9) విడుదలకు అన్ని ఏర్పాట్లు చేయగా...మరో వైపు అనేక సమస్యలు చుట్టు ముట్టాయి. ఈచిత్రం చెన్నైయ్‌లో ప్రదర్శితం అయ్యే థియేటర్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా చెన్నై సిటీ సివిల్ కోర్టు దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది.

తమిళనాడులోని తిరువనెళ్లి జిల్లాకు చెందిన ఎస్‌కెఆర్ కర్ణన్ 'తలైవా' సినిమాకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసాడు. ముంబైలో ఉంటున్న తమిళ కమ్యూనిటీ లీడర్లను సినిమాలో అభ్యంతర కరంగా చూపించారని తన పిటీషన్లో పేర్కొన్నారు. దీంతో స్పందించిన కోర్టు ఆగస్టు 14లోగా వివరణ ఇవ్వాలని దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేసిది.

తలైవా స్టోరీ....ముంబైలో సోషల్ వర్కర్స్‌గా ఉంటూ తమిళ యువత అసాంఘీక కార్యకలాపాల్లోకి వెళ్లకుండా కాపాడుతున్న ఎస్ఎస్ కందస్వామి, అతని కొడుకు ఎస్‌కె రామస్వామిలను పోలి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. పిటీషన్ వేసిన ఎస్‌కెఆర్ కర్ణన్ కందస్వామికి మనవడు, రామస్వామికి కుమారుడు.

మాతాత, తండ్రి ఎలాంటి అండర్ వరల్డ్ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ కాలేదని, వారు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సాగారని ఎస్‌కెఆర్ కర్ణన్ అంటున్నారు. తలైవా స్టోరీ విషయానికొస్తే....ముంబైలోని ధారావి ప్రాంతంలో ఉండే తమిళ అండర్ వరల్డ్ డాన్ స్టోరీ. తమిళం మాట్లాడే ప్రజలకు రక్షకుడిగా ఉండే డాన్ కథ. అతని మరణం తర్వాత అతని కొడుకు విదేశాల నుంచి వచ్చి తండ్రి బాటలో నడుస్తాడని తెలుస్తోంది.

బాంబు బెదిరింపులు

బాంబు బెదిరింపులు

విజయ్‌ హీరోగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో ఆగస్టు 9న తలైవా (అన్న) ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ సినిమా విడుదలవుతున్న చెన్నైలోని తొమ్మిది థియేటర్లకు బాంబు బెదిరింపు వచ్చింది.

బెదిరింపు లేఖ

బెదిరింపు లేఖ

స్థానిక మైలాపూర్‌లోని సిటీసెంటర్‌లో ఐనాక్స్‌ థియేటర్‌ ఉంది. ఈ థియేటర్‌కు 'తమిళనాడు ఒదుక్కపట్ట మావర్‌ పురట్చిపడై' అనే సంఘం పేరిట ఓ లేఖ వచ్చింది. 'తలైవా' (అన్న) విడుదలచేస్తే మీ థియేటర్‌లో బాంబు పేలుతుందని బెదిరించారు.

ప్రభుత్వానికి మొర వినిపించిన ఎగ్జిబిటర్ల

ప్రభుత్వానికి మొర వినిపించిన ఎగ్జిబిటర్ల

దీంతోపాటు మహారాణి, అభిరామి, సత్యం, దేవి, మాయాజాల్‌, భారత్‌, జీవీఆర్‌, ఏజీఎస్‌ థియేటర్లకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియ జేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తొమ్మిది థియేటర్లకూ భారీఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బుకింగ్స్ నిలిపివేత

బుకింగ్స్ నిలిపివేత

ఇదిలా ఉండగా బాంబు బెదిరింపు కారణంగా ఈ థియేటర్లలో రిజర్వేషన్‌ ప్రక్రియను ఆపేశారు. దీంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో ఈ సినిమా చెన్నైలో విడుదలవ్వడం అనుమానంగానే ఉంది.

తెలుగులో అన్న

తెలుగులో అన్న

ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘తలైవా' చిత్రాన్ని 3కె ఎంటర్టైన్మెంట్ సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బి.కాశీవిశ్వనాథం (కాశీ) ‘అన్న' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

Read more about: vijay, anna, విజయ్, అన్న
English summary
Ilayathalapathy Vijay's latest flick Thalaivaa, which is all set to release tomorrow (August 9), has been facing many hurdles from Wednesday (August 8). Many theatres in Chennai received a threat from the political activists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu