అభిమాన గణంతో దళపతి సెల్ఫీ.. వారికి కౌంటర్‌గా బలాన్ని చూపెట్టేందుకేనా?.. వైరల్ పిక్

దళపతి విజయ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట రజినీకి సరి సమానమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడీ హీరో. వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ పని పడుతున్న విజయ్.. చివరగా బిగిల్ (తెలుగులో విజిల్) అంటూ మోతమోగించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300కోట్ల కొల్లగొట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

Recommended Video

Fans Want Actor Vijay To Enter Politics ||
ఐటీ రైడ్స్‌తో షాక్..

ఐటీ రైడ్స్‌తో షాక్..

విజయ్‌పై ఐటీ రైడ్స్ అనే ఈ వార్త గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తూనే ఉంది. బిగిల్ మూవీ బాక్సాఫీస్ లెక్కల్లో అవకతవకలు, ఆయన రెమ్యూనరేషన్‌లోనూ తప్పుడు లెక్కలు ఉండటం, ఆదాయ పన్ను ఎగవేస్తున్నారనే కారణాలతో బిగిల్ చిత్రి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్, హీరో ఇలా అందరిపైనా ఐటీ రైడ్స్ చేశారు.

కక్షగట్టి చేస్తున్నారంటూ ఫైర్..

కక్షగట్టి చేస్తున్నారంటూ ఫైర్..

విజయ్‌పై కావాలనే ఐటీ రైడ్స్ చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నాడని కక్షగట్టి ఈ దాడులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలా విజయ్ ఐటీ రైడ్స్ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకోవడంతో మరింత రచ్చగా మారింది.

షూటింగ్ లొకేషన్లపై దాడి..

విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాష్టర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సమీపంలోని నైవేలీ ప్రాంతంలో మాష్టర్ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగానే.. ఐటీ రైడ్స్ చేశారు. అయితే కొందరు బీజేపీ కార్యకర్తలు వచ్చి షూటింగ్ లొకేషన్లలో గొడవ చేశారు.

 అభిమాన గణంతో సెల్ఫీ..

అభిమాన గణంతో సెల్ఫీ..

అలా బీజేపీ కార్యకర్తలు మాష్టర్ షూటింగ్‌కు ఆటంకం కలిగిస్తున్నారని తెలుసుకున్న విజయ్ అభిమానులు తండోపతండాలుగా కదిలివచ్చారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. పోలీసుల వచ్చి సర్ది చెప్పారు. ఇలా ఆ ఉదంతం ముగిసిపోయింది. అయితే తాజాగా విజయ్ షేర్ చేసిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన అభిమాన గణంతో దిగిన ఆ సెల్ఫీతో.. తనపై కుట్రపూరితమైన చర్యలు చేస్తున్న వారికి తన బలమేంటో అందరికీ చూపెడుతున్నాడా? అని కామెంట్స్ విసురుతున్నారు. ప్రస్తుతం నైవేలీ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X